/rtv/media/media_files/2025/04/02/KWBdCl9HbzXHO7C2V2JP.jpg)
Duvvada Srinivas Madhuri Venu Swamy
దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ జంట ఎంత ఫేమసో అందరికీ తెలిసిన విషయమే. వీరు ఎక్కడికి వెళ్లినా.. ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇద్దరికీ ఇప్పటికే వివాహాలు జరిగినా.. విడాకుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ విడాకులు మంజూరు కాగానే.. తాము వివాహం చేసుకుంటామని ఇప్పటికే వీరు అనేక ఇంటర్వ్యూల్లో ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి ఇటీవలే ఈ జంట హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ భారీ ఎత్తున వస్త్ర దుకాణం కూడా వీరు ప్రారంభించారు. ఈ షాప్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇది కూడా చదవండి: AP Crime: విశాఖలో ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, వీణా శ్రీవాణి దంపతులను హైదరాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి కలిసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట.. పెళ్లికోసమేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. pic.twitter.com/ipj3XEAn95
— RTV (@RTVnewsnetwork) April 2, 2025
వేణు స్వామి చేతుల మీదుగా..
తాజాగా దువ్వాడ శ్రీనివాస్-మాధురి వేణుస్వామి ఇంటికి వెళ్లడం మరింత చర్చనీయాంశమైంది. ఆప్యాయ సమావేశమంటూ దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో అవి వైరల్ గా మారాయి. అయితే.. వివాహం కోసమే శ్రీనివాస్-మాధురి జంట వేణు స్వామిని కలిశారన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. వేణు స్వామి త్వరలోనే వీరి వివాహాన్ని జరిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ అంశంపై దువ్వాడ జంట ఎలా స్పందిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!
తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి
— Telugu360 (@Telugu360) October 7, 2024
అందరికీ చెప్పే, లీగల్ గా క్లియరెన్స్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాం.. pic.twitter.com/Bn35jHCotS
duvvada-srinivas | divvela-madhuri | telugu-news | telugu breaking news