/rtv/media/media_files/2025/04/05/FllPMDdzIGu8HmgX42ba.jpg)
donald trump responds to alekhya chitti pickles controversy
అలేఖ్య చిట్టి పికెల్స్ ఆడియో వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గత రెండు రోజులుగా ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పచ్చళ్లు రేటు ఎక్కువగా ఉంది అని అడిగిన పాపానికి అలేఖ్య చిట్టి.. ఇద్దరు కస్టమర్లపై బూతులతో రెచ్చిపోయింది. ముష్టి పచ్చల్లే కొనలేనపుడు మీ బతుకులెందుకు అన్నట్లు మాట్లాడింది. అందుకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు అలేఖ్యపై రెచ్చిపోయారు.
కస్టమర్లే మా దేవుళ్లు అని వీడియోలలో చెప్తూనే.. నిజ జీవితంలో అలేఖ్య బూతులతో రెచ్చిపోయిందని ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా మీమ్స్, ట్రోలింగ్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. వీడియోల్లో కనిపించే అలేఖ్య వేరు.. రియల్ లైఫ్‌లో అలేఖ్య వేరు అంటూ మండిపడుతున్నారు. జీవితంలో ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలే తప్ప తలపొగరు చూపించకూడదని హితవు పలుకుతున్నారు.
Also read : నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?
ఈ వివాదంపై సోషల్ మీడియాలో ట్రోల్సో, విమర్శలు రచ్చ లేపుతున్నాయి. అలేఖ్య చిట్టి పికెల్స్ పై మీమ్స్ వరద పారుతోంది. మీమర్స్ తమ క్రియేటివిటీని బయటకు తీస్తున్నారు. అలేఖ్య పికిల్స్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవలసిందేనంటూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే మీమర్స్ తాజాగా మరో వీడియో చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also read : పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!
ట్రంప్ ఏమన్నాడంటే?
Donald Trump's response to the ALEKHYA CHITTI PICKLES issue.#DonaldTrump#AlekyaChittiPickles pic.twitter.com/Q3LPKuSOcG
— SHOURYAANGA (@shouryaanga1) April 5, 2025
మీమర్స్ ఈ వివాదంలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లాగారు. అలేఖ్య చిట్టి పికెల్స్ పై ట్రంప్ స్పందించినట్లు ఓ వీడియో క్రియేట్ చేశారు. అందులో ట్రంప్.. ‘‘అలేఖ్య చిట్టి పికెల్ కాంట్రవర్సీపై దించాలనుకుంటున్నాను. కస్టమర్‌కు జరిగిన అవమానం విని నాకు చాలా బాధ కలిగింది. అందువల్లనే నేను మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. అలేఖ్య చిట్టి పికెల్స్‌ను బాయ్ కాట్ చేయాలి. ఈ సంఘటన నుంచి వాళ్లు గుణపాఠం నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను’’ అంటూ ఆ వీడియోలో ట్రంప్ చెప్పినట్లు క్రియేట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
Also Read : అయ్యో తల్లి.. నవరాత్రుల కోసం ప్లాన్.. పీరియడ్స్ రావడంతో సూసైడ్!
(alekhyaa chitti pickle | alekhya chitti pickles audio | alekhya chitti pickles controversy | america president trump | viral-news)