మాధురి పుట్టిన రోజు వేడుకలు.. వెలకట్టలేని బహుమతిచ్చిన శ్రీనివాస్

దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలను వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటిసారి మాధురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను టెక్కలి నియోజకవర్గ ప్రజల మధ్య శ్రీనివాస్ ఘనంగా జరిపించారు.

New Update
Duvvada

వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ గతంలో శ్రీనివాస్ భార్య వాణి ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీరి వివాదం సంచలనం సృష్టించింది. అయితే ప్రస్తుతానికి వీరు స్నేహితులు అని త్వరలో భార్యాభార్తలుగా మారనున్నామని కూడా వీరు పలు సందర్భాల్లో చెప్పారు. 

56089843-2cfb-4040-9753-16f873e7dae3

ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం!

ఘనంగా పుట్టిన రోజు వేడుకలు..

ఇదంతా పక్కన పెడితే నేడు దివ్వెల మాధురి పుట్టిన రోజు. ఈమె పుట్టిన రోజు వేడుకలను దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ఘనంగా నిర్వహంచారు. దీంతో RTV రిపోర్టర్ ఆమెతో మాట్లాడారు. శ్రీనివాస్ ఇలా పుట్టిన రోజు వేడుకలు జరపడంతో ఎలా ఉందని రిపోర్టర్ అడగడంతో ఆమె స్పందిస్తూ.. మొదటిసారి ఇలా పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరపడంతో ఆనందానికి అవధుల్లేవని మాధురి అన్నారు. 

7a911a4b-234f-4a14-8e4a-3b0a9f9a41a8

ఇది కూడా చూడండి: US: ట్రంప్‌ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌!

ఇలా నియోజకవర్గం ప్రజలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తన లైఫ్‌లో ఇదో బెస్ట్ మెమోరీ అని మాధురి తెలిపారు. అయితే పుట్టిన రోజు సందర్భంగా శ్రీనివాస్ మీకు స్పెషల్ గిఫ్ట్ ఏం ఇచ్చాని రిపోర్టర్ అడగ్గా.. వెలకట్టలేని గిఫ్ట్ తన మనస్సును నాకు ఇచ్చారని మాధురి తెలిపారు. కోర్టు కేసులు అన్ని క్లియర్ అయ్యాక భార్యాభర్తలుగా మారుతామని, ప్రస్తుతానికి మానసికంగా భార్యాభర్తలే అని ఆమె తెలిపారు. 

ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్‌

ఇదిలా ఉండగా నవంబర్ 4న దువ్వాడ శ్రీనివాస్ పుట్టిన రోజు కూడా జరిగింది. ఈ సందర్భంగా దివ్వెల మాధురి ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ వాచ్ ఖరీదు సుమారుగా రూ.2 లక్షలు ఉంటుందట. 

ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IAS transfers : ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు...సిసోడియా ఔటు- ముత్యాల రాజుకు చోటు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. సీనియర్ ఐఏఎస్ సిసోడియాను బదిలీ చేసారు.

New Update
IAS transfers

IAS transfers

IAS transfers :  ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి రెవిన్యూ - రిజిస్ట్రేషన్ శాఖలు కీలకంగా మారాయి.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

ఈ శాఖలను ఇప్పటి వరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పర్యవేక్షించిన సీనియ ర్ ఐఏఎస్ అధికారి సిసోడియాను బదిలీ చేసారు. సిసోడియాకు హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు కేటాయించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతల అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

ఇక, ప్రస్తుతం ఐటీ కార్యదర్శిగా ఉన్నా కాటమనేని భాస్కర్ కు ఏపీ హెచ్ఆర్డీ సంస్థ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓలో కీలకం గా వ్యవహరించిన ముత్యాల రాజుకు ఇప్పుడు పోస్టింగ్ దక్కింది. ఆయనకు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయితీ రాజ్ సెక్రటరీగా నియమించారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న మరో అధికారి మాధవీ లతకు రైతు బజార్ల సీఈవోగా నియామకం చేసారు. మరో ఐఏఎస్ గౌతమికి గిరిజన విద్య సంస్థల కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఫైబర్ నెట్ లో జీవీ రెడ్డి పై ఆరోపణలు చేసి.. అక్కడ నుంచి బదిలీ అయిన దినేష్ కుమార్ ను ఆయూష్ డైరెక్టర్ గా నియమించారు. ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీ గా కే నీలకంఠారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment