పవన్ పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. ఏ క్షణమైనా అరెస్టు!?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పై దివ్వెల మాధురి కేసు పెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు అయ్యే అవకాశం ఉంది. 

author-image
By srinivas
New Update
ttteteere

Duvvada- maduri: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పై దివ్వెల మాధురి కేసు పెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు అయ్యే అవకాశం ఉంది. 

వెంటనే చర్యలు తీసుకోండి.. 

ఈ మేరకు పవన్ పై కేసు పెట్టిన మాధురి RTVతో మాట్లాడుతూ.. దువ్వాడపై పవన్ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడని చెప్పింది. పవన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపింది. తిరుపతి వెళ్లినప్పుడు కూడా పవన్ అభిమానులను తనను దారుణంగా అవమానపరిచారని, యూట్యూబ్ లో వల్గర్ పోస్టులు, కామెంట్స్ తో ఇబ్బందికి గురి చేశారని వాపోయింది. 

ఇది కూడా చదవండి: Samantha: చైతూ కోసం సమంత కాస్ట్లీ గిఫ్టులు.. అవేంటో తెలుసా?

ఇదిలా ఉంటే.. దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పై రెండేళ్ల క్రితం దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని అచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. 


ఇది కూడా చదవండి: Diabetes: దీన్ని తేనెతో కలిపి తింటే మధుమేహం, కొలెస్ట్రాల్‌ కంట్రోల్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment