/rtv/media/media_files/2025/02/20/n5SFBYvno07pq48ikaG9.jpg)
AP High Court
AP High Court: గ్రూపు -2(Group -2) పరీక్షను నిలివేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించనున్న గ్రూప్-2 ప్రధాన పరీక్ష ప్రక్రియను నిలువరించాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను ఏపీ హైకోర్టు గురువారం కొట్టేసింది. ప్రస్తుత వాజ్యాలలో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి గ్రూప్-2 ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌లో మహిళలు, మాజీ సైనిక ఉద్యోగులు(Ex-military Personnel), క్రీడాకారులు(Sports Persons), దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు(Reservation Points) కేటాయించడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: America: పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీ్‌సమెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేకంగా రోస్టర్ స్లాట్స్ (రిజర్వేషన్ పాయింట్లు) కేటాయిస్తూ 2023 డిసెంబరు 7న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు బొద్దులూరి శ్రీనివాసరావు, జీవీ శివాజీ వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్‌ను ఫిక్స్ చేసి గ్రూప్-2 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖకు చెందిన ఎం. పార్థసారథి, కడపకు చెందిన కనుపర్తి పెంచలయ్యతో పాటు మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ జీవోను కోర్టు ముందుంచారు. ఈ నెల 23న జరగే గ్రూప్-2 ప్రధాన పరీక్షను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే ముగిసిందని, ప్రధాన పరీక్షను నిలువరించవద్దని కోరారు. ప్రధాన వ్యాజ్యంపై కౌంటర్ వేసేందుకు సమయం కోరారు.
ఇది కూడా చదవండి: Kiran Royal-laxmi: బలవంతంగా కామదాహం తీర్చుకున్నాడు.. ఆ నీచుడిని అరెస్టు చేయండి!
ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్..
రిజర్వేషన్ల అమలుతోపాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ జీవోను ఈ సందర్భంగా కోర్టు ముందు ఉంచారు. ఈ నెల 23వ తేదీన జరగనున్న గ్రూప్-2 ప్రధాన పరీక్షను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరారు. అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే ముగిసిందని, ప్రధాన పరీక్షను నిలువరించ వద్దని హైకోర్టును కోరిన విషయం విధితమే. అలాంటి వేళ.. ఏపీ హైకోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: Viral News: అసలు ఈ దేవిక ఎవరు? సోషల్ మీడియాలో TDP, YCP ఫ్యాన్స్ రచ్చ రచ్చ!