Posani Krishna Murali : పోసానికి ఏపీ హైకోర్టులో నిరాశ..క్వాష్ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని నటుడు పోసాని కృష్ణ మురళి ఏపీ హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.

New Update
posani

Posani Krishna Murali

Posani Krishna Murali  :  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, విజయవాడలోని సూర్యారావుపేట, కర్నూలు, అదోని టూటౌన్ పోలీసులు వేర్వేరుగా నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని పిటిషన్‌లలో కోరారు. ఈ కేసులలో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా పోసాని కృష్ణ మురళి హైకోర్టును అభ్యర్థించారు.

Also Read: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు


పోలీసులు తనపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని... రెండు సముహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా తాను వ్యాఖ్యలు చేయలేదని పోసాని తన పిటిషన్లలో పేర్కొన్నారు. తనను తప్పుడు కేసులలో ఇరికించారని ఆరోపించారు. ఈ నాలుగు కేసులలో సెక్షన్‌లు అన్ని ఏడేళ్లలోపు జైలుశిక్షకు సరిపడేవే అని... అందువల్ల ముందుగా నోటీసు ఇచ్చి పోలీసులు వివరణ తీసుకోసునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోసాని క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అయితే తనపై నమోదైన కేసులు కొట్టివేయాలన్న పోసాని పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది.  ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే.. పీటీ వారెంట్ అమలు అయినందున పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Also Read: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి తీసుకున్న రమ్మీ

ఇక, పోసాని కృష్ణమురళిపై వివిధ పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపిస్తూ ఫిర్యాదులు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తొలుత అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రైల్వే కొడూరు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అయితే నరసరావుపేట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు రాజాంపేట సబ్ జైలుకు చేరుకుని పీటీ వారెంట్‌పై పోసానిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం నరసరావుపేట కోర్టులో పోసానిని హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళికి ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు సబ్ జైలుకు తరలించారు.

Also Read: మేఘా అవినీతిపై ముంబై హైకోర్టులో విచారణ!

ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. విశాఖ  తో పాటు చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అదేవిధంగా పోసానిపై ఆదోని పోలీసుల పీటీ వారెంట్‌ అమలైనందున పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది.

Also read: live longer: అందరికన్నా వీళ్లు మూడేళ్లు ఎక్కువ జీవిస్తారు.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు