Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికల విధానానికి తాము ఇప్పటికే మద్దతు ప్రకటించామన్నారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు.

New Update
AP CM Chandrababu Naidu

CM Chandra Babu : జమిలి ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికల విధానానికి తాము ఇప్పటికే మద్దతు ప్రకటించామన్నారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని చెప్పారు.

Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...

విజన్-2047...

స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని చెప్పారు. 1996 నాటి ఏపీ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయని అన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని తెలిపారు. భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని కోరారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ తరహాలో కాకుండా ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు-సమాధానాల రూపంలో నిర్వహిస్తాం అని చెప్పారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరి వారి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. 

Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు

ఎల్లుండి పార్లమెంట్ లో బిల్లు...

ఈ నెల 16న లోక్ సభ ముందు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది.129వ రాజ్యంగ సవరణ కింద బిల్లు ప్రవేశపెట్టనుండగా నాలుగు సవరణలు చేసే అవకాశం ఉంది. అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’ను డిసెంబర్ 16న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించాయి. అనంతరం దీనిపై చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు.

Also Read: తల్లి ప్రాణం తీసిన ఊయల.. మంచిర్యాలలో విషాదం

Also read: స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment