AP News: ఏపీ మద్యం అక్రమ వ్యవహారాలపై సీఎం చంద్రాబాబు సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. MRP ధరలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. దుకాణం లైసెన్స్ రద్దు.. ఈ మేరకు మద్యం అక్రమాల వ్యవహారాల్లో భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఐదు లక్షలు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. రెండోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపు లు నిర్వహిస్తే కూడా ఐదు లక్షల జరిమానా వేస్తామని హెచ్చరించింది. ఇందులో భాగంగా ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే నిబంధన కింద బార్ లైసెన్సులకూ వర్తిస్తాయని పేర్కొంది. ఇది కూడా చదవండి: మా జోలికొస్తే తాటతీస్తాం.. కేసీఆర్ ను అంత మాట అంటావా! కవిత ఫైర్ ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. గత ఐదేళ్లలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టింది. కొత్త బ్రాండ్లను విక్రయించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రైవేటుకు అప్పగించింది. లాటర్ విధానంలో లైసెన్సులను కేటాయించింది. 2014-2019 హయాంలో మాదిరిగానే రాష్ట్రంలో ఆయా బ్రాండ్లనే అమల్లోకి తీసుకుంది. ధరలు కూడా తగ్గడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు! ఇది కూడా చదవండి: మా జోలికొస్తే తాటతీస్తాం.. కేసీఆర్ ను అంత మాట అంటావా! కవిత ఫైర్ Also Read: టాలీవుడ్ హీరోలపై బండ్ల గణేష్ సెటైర్లు.. టికెట్లకు మాత్రమే CM అవసరం..