వైసీపీకి బిగ్ షాక్.. మూడు రోజులు కస్టడీకి తీసుకున్న సీఐడీ

టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఏ-1 పానుగంటి చైతన్యను సీఐడి కస్టడీలోకి తీసుకుంది. చైతన్యను విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని సీఐడి కోరగా.. కోర్టు మూడు రోజులకు అనుమతించింది. ఈ మేరకు న్యాయవాదులకు కనిపించేలా విచారణ జరపాలని కోర్టు సూచన చేసింది.

New Update
jagan

మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం అధక్షుడు పానుగంటి చైతన్య ఇటీవలే కోర్టులో లొంగిపోయాడు. దీంతో టీడీపీ ఆఫీస్ దాడి కేసులో చైతన్య ఏ-1 నిందితుడిగా ఉన్నాడు. ఇక ఏ-1గా ఉన్న చైతన్యను పోలీసులు గుంటూరు జిల్లా జైల్లో ఉంచారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే కూల్చు.. రేవంత్ కు కిషన్ రెడ్డి సంచలన సవాల్!

3 రోజుల కస్టడీకి అనుమతి

అయితే ఈ దాడి కుట్రకు సూత్రధారి ఎవరో తెలియాలంటే విచారణ కోసం చైతన్యను కస్టడీకి అప్పగించాలని ఇటీవల సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగానే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మంగళగిరి కోర్టు చైతన్యను 3 రోజుల కస్టడీకి అనుమతించింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు మూడు రోజుల పాటు చైతన్యను సీఐడీ అధికారులు విచారించనున్నారు. 

ఇది కూడా చదవండి: చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు!

దీంతో కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. జైలు నుంచి చైతన్యను అదుపులోకి తీసుకున్న సీఐడీ విచారణ కోసం ప్రాంతీయ కార్యాలయానికి తరలించనుంది. అయితే న్యాయవాదులకు కనిపించేలా విచారణ జరపాలని కోర్టు సూచన చేసింది. ఈ తరుణంలో చైతన్యకు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో మెడికల్ టెస్ట్‌లు చేశారు. ఆ టెస్ట్‌ల రిపోర్ట్స్ వచ్చిన అనంతరం చైతన్యను సీఐడీ కార్యాలయానికి తరలించనున్నారు. 

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

కాగా పానుగంటి చైతన్య వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటంతో పాటు.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ముఖ్యంగా గుంటూరులో అప్పిరెడ్డి నిర్వహించే కార్యక్రమాల్లో చైతన్య చురుగ్గా పాల్గొనేవాడు. 

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి

కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో దాదాపు 200 మంది వరకు 2021 అక్టోబరు 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment