డ్రోన్ మార్కెట్ కు నేనే బ్రాండ్ అంబాసిడర్, వారికిదే ఛాలెంజ్: చంద్రబాబు

అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024లో చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు ఛాలెంజ్ విసరబోతున్నామని అన్నారు. అలాగే విజిబుల్ పోలీసింగ్ తగ్గించి శాంతిభద్రతల పరిరక్షణ మెరుగుపడేలా చేస్తామని

New Update

అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. ఈ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. డ్రోన్ ఇండస్ట్రీ దేశంలో అభివృద్ది చెందుతూ ఉన్న పరిశ్రమ అని అన్నారు. మొదటిగా హైటెక్ సిటీని పిపిపి మాడల్ లో తీసుకువచ్చాం అని చెప్పారు. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా హైటెక్ సిటీని రూపోందించామన్నారు. అంతేకాకుండా అప్పుడు అమెరికా వెళ్లి కార్పోరేట్ ఎక్సపర్ట్స్,  జెయింట్స్ తో కలిసి మాట్లాడానని చెప్పారు. ఇండియా టెక్నాలీజీ చాలా ఉన్నతమయిందన్నారు. 

ఇండియా వారు టెక్నాలజీల్లో చాలా స్ట్రాంగ్

బ్రిటీషర్లు ఇండియా నుండి, ఆంధ్రా నుండి కోహినూరు పట్టుకెళ్లారని.. ఇదే సమయంలో ఇంగ్లీష్ ను వదిలి వెల్లారని అన్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేవారు ఉన్న దేశం ఇండియానే అని చెప్పారు. ఇండియా వారు ఐటిలో, నాలెడ్జ్ ఎకానమీలో అంటే ఫార్మా, బయో టెక్నాలజీల్లో చాలా స్ట్రాంగ్ అని కొనియాడారు. ఇలాంటి సమ్మిట్ ఉండడం పట్ల చాలా ఆనందంగా ఉన్నామని.. దీనికి కారణం ఇది గేమ్ ఛేంజర్ అవుతుంది భావిస్తున్నామని అన్నారు. ఏపి ఎప్పుడు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలను అందుకోవడం, మెడ్రన్ టెక్నాలజీని వాడడంలో ముందుందన్నారు. ఐవోటి డివైజ్లు రన్ టైం బేసిస్ లో సింక్రనైజ్ అవ్వాలన్నామని తెలిపారు. 

ఇది కూడా చదవండిః మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?

డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు ఛాలెంజ్

అంతేకాకుండా డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు ఛాలెంజ్ విసరబోతున్నామని అన్నారు. అంతేకాకుండా డ్రోన్ల ద్వారా విజిబుల్ పోలీసింగ్ తగ్గించి శాంతిభద్రతల పరిరక్షణ మెరుగుపడేలా చేస్తామని తెలిపారు. అసాంఘిక శక్తులు, రౌడీషీటర్ల కదలికలు ట్రాఫిక్ సమస్యలు ఇలా పోలీస్ శాఖలో డ్రోన్ల విస్తృత వినియోగానికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో దేశానికైనా, కంపెనీకైనా డేటానే ఎంతో కీలకమని.. డేటాని ఏఐకి అనుసాధించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. విజయవాడ వరదల్లో దాదాపు లక్షన్నర మందికి డ్రోన్ల సాయంతో ఆహారం అందివ్వటం ఓ వినూత్న ప్రయోగం అని చెప్పారు.

రేపటి తరానికి డ్రోన్లు గేమ్ చేంజర్లు

అంతేకాకుండా డ్రోన్ సాయంతో రియల్ టైమ్ లో 20వేల మెట్రిక్ టన్నుల చెత్తను గుర్తించి ఎత్తివేయించాం అని చెప్పుకొచ్చారు. రేపటి తరానికి డ్రోన్లు గేమ్ చేంజర్లు కాబోతున్నాయన్నారు. వైద్యం, వ్యవసాయం, రహదారుల నిర్మాణం ఇలా వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం కీలకం కానుందని తెలిపారు. ఈ వినూత్న ఆలోచనలకు లాజికల్ పరిష్కారం చూపాల్సిన బాధ్యత డ్రోన్ తయారీదారులపై ఉందని అన్నారు. ఇప్పుడు యుద్దాల్లో కూడా వాడే డ్రోన్లను అభివృద్ధి కోసం వినియోగించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి చేయటమే ఆంధ్రప్రదేశ్ ముఖ్య లక్ష్యమని చెప్పారు.

ఇది కూడా చదవండి:  రేవంత్‌ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే?

15రోజుల్లో డ్రోన్ పాలసీ ప్రకటిస్తాం

20వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అమరావతిని దేశానికి డ్రోన్ నగరంగానూ, ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ హబ్ గా తీర్చి దిద్దుతాం అని చెప్పుకొచ్చారు. అందరి ఆలోచనలతో 15రోజుల్లో డ్రోన్ పాలసీ ప్రకటిస్తాం అని తెలిపారు. కర్నూల్ సమీపంలోని ఓర్వకల్లు వద్ద 300ఎకరాల భూమిని డ్రోన్ హబ్ కోసం కేటాయిస్తున్నామన్నారు. నూతన ఆవిష్కరణలకు ఇది కేంద్రం కావాలని ఆకాంక్షిస్తున్నా అని అన్నారు.

నేనే డ్రోన్ మార్కెట్ విస్తరణకు బ్రాండ్ అంబాసిడర్

అలాగే డ్రోన్ మార్కెట్ విస్తరణకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాని తెలిపారు. తానే ఈ రంగాన్ని ప్రోత్సహించకుంటే ఇంకెవరూ ప్రోత్సహించలేరన్నారు. ఎక్కువ నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దని కేంద్ర పౌరవిమానయాన శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాని తెలిపారు. యువత, డ్రోన్ తయారీ పరిశ్రమలు, కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తూ అద్భుతాలు సృష్టింద్దాం అని పిలుపునిచ్చారు. వినూత్న ఆలోచనల దిశగా విద్యార్థులను మలచాలని విశ్వవిద్యాలయాలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. సర్వీస్ ప్రొవైడర్ కు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్ కానుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు

అనంతరం కేంద్రం పౌర విమానయాన శాఖామంత్రి, కింజరపూ రామ్మోహన నాయుడు మాట్లాడారు. దేశంలో మొదటిసారి డ్రోన్ సమ్మిట్ ఢిల్లీకి బయట జరగుతోందని అన్నారు. తాను మంత్రి అయ్యాక చాలా మంది ముఖ్యమంత్రులు ఎయిర్ పోర్టులు, హెలిపోర్టులు గురించి అడిగారని చెప్పారు. అయితే ఏపి ముఖ్యమంత్రి మాత్రం ఎయిర్ పోర్టులతో పాటు కనెక్టివిటీ, డ్రోన్ ల ప్రాధాన్యం గురించి మాట్లాడారన్నారు. ఏపి ప్రభుత్వానికి, సీఎంకు ఇంత మంచి వాతావరణం డ్రోన్ సమ్మిట్ కోసం ఏర్పాటు చేయడం పట్ల ధన్యవాదాలు తెలయజేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ భవిష్యత్తును విజన్ చేసి విజన్ 2020 గురించి ఆలోచించారన్నారు. 1996 సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు 2020 గురించి ఆలోచించారని పేర్కొన్నారు. ఆయన వచ్చె ఎన్నికల గురించి ఆలోచించరు, కేవలం భవిష్యత్తును ఊహిస్తారంతే అని సీఎం చంద్రబాబును కొనియాడారు. 

డ్రోన్ నెట్వర్క్ లో ఎంతో పోటన్షియల్ ఉంది

అందుకే హైదరాబాద్ అన్ని రంగంగాల్లో నేడు అభివృద్ది చెందిందన్నారు.1996లో ఆయన హైదరాబాద్ గురించి ఎలా మాట్లాడారో అలాగే ఇప్పుడు అదే జీల్ తో డ్రోన్ గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇచ్చిన క్యాబినెట్ మినిస్ట్రీలో ఒక అవకాశాన్ని యువకుడికి ఇవ్వాలని తనకు అవకాశం కల్పించారన్నారు. డ్రోన్ నెట్వర్క్ లో ఎంతో పోటన్షియల్ ఉందని సీఎం చంద్రబాబు గుర్తించారని చెప్పారు. ఈవిషయాన్ని విజయవాడలో వరదల సమయంలో డ్రోన్ లు సహయ కార్యక్రమాలకు పుడ్ సప్లైకి వాడారని.. డ్రోన్ ద్వారా ఆహరం, పాలు, మందులు అందించారని.. అయితే డ్రోన్ లు ఇలా వాడడాన్ని ప్రధాని సైతం చూసి ఆనందించారని అన్నారు. 

కొత్త టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఏపీకి తేవాలని సీఎం ఆలోచిస్తున్నారు

ఇది కూడా చదవండిః అఘోరీ అసలు పేరు శ్రీనివాస్.. తల్లిదండ్రుల సంచలన నిజాలు

ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాను ప్రపంచంలోనే గొప్ప పొజిషన్ లో నిలిపారని కొనియాడారు. వివిధ దేశాల నాయకులు ఇండియాను చూసి నేర్చుకోవాలనుకుంటున్నారని తెలిపారు. గత పది సంవత్సారాలుగా సివిల్ ఏవియేషన్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయని పేర్కొన్నారు. అంతకుముందు ఇండియాలో 74 ఎయిర్ పోర్టులు ఉంటే ఇప్పడు 157 ఎయిర్ పోర్టులు ఏర్పాటయ్యాయని వివరించారు. రానున్న రోజుల్లో వీటిని మంరింతగా పెంచుతామని చెప్పుకొచ్చారు. డ్రోన్ లో వర్టికల్ టేకాఫ్‌ అండ్ ల్యాండింగ్ వంటి టెక్నాలజీ పరిజ్ఞానం వచ్చిందని.. ఇలాంటి కొత్త టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఏపికి తేవాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. 

మహిళలకు ఉపాధి

ఈ డ్రోన్ సెక్టర్ లో ఇక్కడి వారు ముందుకు రావాలి నిర్మాణాలు చేపట్టాలి.. అందుకే డ్రోన్ రూల్స్ 2021ను చాలా సరళతరం చేశామని తెలిపారు. దీనికి అదనంగా డ్రోన్ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. డ్రోన్ ఇండస్ట్రీ పై మరింత రీసెర్చి ఉరగాలనేది తమ అభిమతం అని చెప్పారు. 26,500 డ్రోన్ లు రిజిష్టర్ అయి ఉంటే ప్రధాని దాన్ని లక్షకు చేర్చాలని చెప్పారని తెలిపారు. డ్రోన్ దీదీ ప్రోగ్రాం ద్వారా దేశంలో మహిళలకు ఉపాధి సైతం కలుగుతోందని.. ఏపీ ఇప్పడు డ్రోన్ పాలసీని రూపోందిస్తోందని అన్నారు. అందరితో మాట్లాడి దాన్ని రూపోందించడంతో ఇదే బెస్ట్ పాలసీ అవుతుందని చెప్పారు. 6000 కంటే ఎక్కువ మంది ఈ ఈవెంట్ లో పార్టీసిపేట్ చేయాలని ఉత్సాహం చూపారని తెలిపారు. ఏపి ఇండియాలోనే కాదు ప్రపంచానికే డ్రోన్ హబ్ గా మారాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు