Crime: నడి రోడ్డుపై కత్తులతో నరికి..ఏపీలో హిజ్రాల నాయకురాలి దారుణ హత్య

ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలు ముగించుకు ని బయల్దేరిన హిజ్రా నాయకురాలు హాసిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Nellore: హిజ్రా నాయకురాలి హత్యతో నెల్లూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలు ముగించుకు ని బయల్దేరిన  హిజ్రా నాయకురాలు హసినిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి దుండగులుహత్య చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు హిజ్రాల నాయకురాలు కావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.

Also Read: Pawan Kalyan: రాజ్యసభకు నాగబాబు.. పవన్ సంచలన నిర్ణయం!

కారులో వచ్చి..

నెల్లూరులోని దీనదయాళ్‌నగర్‌కు చెందిన హాసిని కొన్ని రోజులుగా తిరుపతి శివారు మంగళం ప్రాంతంలో నివసిస్తోంది. ఈమెకు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలమైన వర్గముంది. విడవలూరు మండలం పార్లపల్లి సమీపంలో మహాలక్ష్మమ్మ ఆలయ పునర్నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టి కొంతమేరకు పనులు చేయించింది. ఈ క్రమంలో మంగళవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.

Also Read: Psycho Killer: 11 రోజులు..5 హత్యలు..ఒంటరి మహిళలే లక్ష్యం!

ఆమెతోపాటు సహచర హిజ్రాలు పాల్గొని పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హాసిని కారులో నెల్లూరుకు బయలుదేరింది. టపాతోపు రైల్వే గేటు అండర్‌ బ్రిడ్జి వద్ద ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆమె కారును అడ్డగించారు. ఆమెను బలవంతంగా బయటకు లాగి మెడ, వీపు భాగంలో కత్తులతో నరికి చంపారు. అదే సమయంలో వెనుక ఆటోలో వస్తున్న హిజ్రాలను చూసి దుండగులు ఘటనా స్థలంనుంచి పారిపోయారు.

Also Read: AP : శుక్రవారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు..ఇంకో 4 రోజులు

అప్పటికే తీవ్రంగా గాయపడిన హాసినిని అంబులెన్స్‌లో నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

Also Read: PAN CARD: కొత్త పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ఏంటి? దీని వలన లాభాలేంటి?

హిజ్రాల నాయకురాలు హాసిని హత్యకు గురైన విషయం తెలుసుకున్న నెల్లూరు, కడప, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాలతోపాటు తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో హిజ్రాలు బుధవారం నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావును కలిసి తమ నాయకురాలిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం జీజీహెచ్‌ మార్చురీలో హాసిని మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తీసుకుని వెళ్లారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ.. జగన్, పవన్ లపై హర్షకుమార్ సంచలన కామెంట్స్!

ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌.  ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా దీనిపై స్పందించలేదని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదేనన్నారు. 

New Update
jagan-and-harsha-kumar

jagan-and-harsha-kumar

ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌.  ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించలేదని.. డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదేనన్నారు. 

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

Also Read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!

ముమ్మాటికీ హత్యే

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాలది ముమ్మాటికీ హత్యేనని..  న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తానని హర్షకుమార్ వెల్లడించారు. ఇందుకోసం  2025 శనివారం 19వ తేదీన గుడ్ ఫ్రైడే  రోజున సాయంత్రం 4 గంటల నుండి 6.30 గంటల వరకు ఎవరికి వారు వచ్చి ప్రవీణ్ దేహం ఎక్కడ దొరికిందో కొవ్వూరు దివాన్ చెరువు రోడ్ లో నయార పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న స్థలంలో ఎవరికి వారు ఒక కొవ్వొత్తు తెచ్చుకొని అక్కడ వెలిగించి వెళ్ళండని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రవీణ్ ను  ప్రభుత్వమే హత్య చేయించిందని నమ్మే ప్రతి ఒక్కరు రావలన్నారు హర్షకుమార్. అలాగే ఈస్టర్ ఆదివారం ఆంధ్రా, తెలంగాణలో ఉన్న ప్రతి సమాదుల దొడ్డి దగ్గర ప్రవీణ్ ఫ్లెక్సీ పెట్టి కొవ్వొత్తులు వెలిగించాలన్నారు. మన నిరసనను కూడా చాలా శాంతి పంథంలో తెలుపుదామని.. తనకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని హర్షకుమార్ వీడియోలో కోరారు.  

ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ప్రభుత్వం ఇప్పటి దాకా స్పందించలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించలేదు....

Posted by GV Harsha Kumar on Wednesday, April 16, 2025

Also read :  పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

Advertisment
Advertisment
Advertisment