రాజమహేంద్రవరం జైలుకు బోరుగడ్డ అనిల్.. అసలు ఎవరితను ? గుంటూరుకు చెందిన వివాదాస్పద వ్యక్తి బోరుగడ్డ అనిల్‌ను అక్టోబర్ 29 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అతడిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అనిల్ గురించి మరింత సమాచారం తెలుసుకనేందుకు ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి గుంటూరుకు చెందిన వివాదాస్పద వ్యక్తి బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం కోర్టులో అతడిని హాజరుపరచగా.. అక్టోబర్ 29 వరకు రిమాండ్ విధిస్తూ ఐదో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అనిల్‌ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కర్లపుడి బాబు ప్రకాశ్ రాజ్ అనే వ్యక్తిని రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ అసలు ఈ బోరుగడ్డ అనిల్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి జగన్‌కు అనుకూలంగా ఉంటూ గుంటూరు నగరానికి చెందిన బోరుగడ్డ అనిల్ కేంద్రమంత్రిగా పనిచేసిన రాందాస్ అథవాలే అనచరుడని చెప్పుకునేవాడు. అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అంటూ చలామణి అయ్యాడు. జగన్‌కు మద్దతుగా ఉంటూ తాను పులివెందులకు చెందినవాడినే అంటూ చెప్పుకొనేవాడు. జగన్‌కు అనుకూలంగా ఉంటూ విపక్ష పార్టీలు, నేతలపై సోషల్ మీడియాలో, టీవీ డిబేట్‌లలో ఇష్టమచ్చినట్లు దూషించేవాడు. జగన్‌కు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్లపై అసభ్యకరంగా దూషణలు చేస్తుండేవాడు. ముందుగా ఆంధ్రప్రదేశ్ #APPOLICE100 కృతజ్ఞతలు🙏🙏.....చేతికి చిక్కిన బోరుగడ్డ అనిల్ కుమార్ ని చేయజారకముందే టాస్క్ కంప్లీట్ చేయండి సార్ ☠️☠️☠️☠️......✌️ఇట్లు మీ చింతమనేని అభిమాని✌️#TDPTwitter #tdpyuvashakthi #TDPMLA #NaraChandrababuNaidu #NaraLokeshForPeople pic.twitter.com/U8pmyOvX7a — రావణ (@NBK_CHOW) October 17, 2024 Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు దందాలు, దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌ను ఉద్దేశించి కూడా గతంలో అనేకసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వీళ్లపై చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అలాగే విపక్షాలకు చెందిన మహిళల గురించి కూడా అనిల్ అసభ్యంగా మాట్లాడేవాడు. జగన్ పేరు చెప్పుకుంటూ గుంటురు నగరంలో దందాలు, దౌర్జన్యాలు కూడా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీని చూసుకోని ఇష్టరాజ్యాంగా చెలరేగిపోయాడు. Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం! చంపేస్తానంటూ బెదిరింపులు గతంలో అనిల్ చంద్రబాబును కూడా చంపేస్తానని అన్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే 2021లో అతడు కర్లపుడి బాబు ప్రకాష్ అనే వ్యక్తిని రూ.50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను చెప్పినట్లు ఇవ్వకపోతే చంపేస్తానంటూ కూడా బెదిరించాడు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తాజాగా గుంటూరులో అనిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు తనభర్తను అక్రమంగా అరెస్ట్ చేశారమి అతని భార్య మౌనిక ఆరోపిస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంట్లోకి చొరబడి తాళాలు పగలగొట్టి తీసుకువెళ్లాలని తెలిపారు. అనిల్‌ను అరెస్టు చేయడం ప్రస్తతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా! #ap-politics #andhra-padesh #Borugadda Anil Kumar Arrest #Borugadda Anil Kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి