/rtv/media/media_files/2025/03/05/4jFvcDXH9pkL0LubaEL6.jpg)
Y. S. Vivekananda Reddy
YS Viveka murder case : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎటు తేలడం లేదు. జగన్ ప్రభుత్వ హయాంలో కేసు కొలిక్కి వస్తుందని భావించినప్పటికీ అది జరగలేదు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉండగానే ప్రధాన సాక్షి ఒకరు మరణించడంతో కేసు అనూహ్య మలుపుతిరిగింది. ఒకనాడు సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?
ఈ కేసులో ప్రధాన సాక్షి ఒకరు మరణించారు. ఫలితంగా- మున్ముందు దీని ఫలితం ఎలా ఉంటుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సాక్షి పేరు- రంగన్న. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి. గతంలో వివేకానందరెడ్డి ఇంట్లో వాచ్‌మెన్‌గా పని చేశారు. వృద్ధాప్యం, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందుల వల్ల ఏడెనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి కిందటే మరణించారు.
Also read : సింగర్ కల్పన ఆత్మహత్యకు అదే కారణం.. షాకింగ్ విషయాలు
రంగన్న స్వస్థలం పులివెందుల. అక్కడ ఉన్నప్పుడే అనారోగ్యానికి గురయ్యారు. గత ఏడాది జులై నుంచి ఆసుపత్రిలో తరచూ చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజుల పాటు పులివెందుల ఆసుపత్రిలోనూ అడ్మిట్ అయ్యారు. అయినప్పటికీ- ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. 2019 మార్చిలో సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మాజీ మంత్రి వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన ఇంటి దగ్గర రంగన్న వాచ్‌మెన్‌గా పని చేశారు. ఆయన ఈ కేసులో ప్రధాన సాక్షిగా మారారు.
Also Read : అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డు చేశారు. అలాగే- రంగన్న తమ వద్ద ప్రస్తావించిన పలు అంశాలను ఛార్జిషీట్‌లో కూడా పొందుపరిచారు సీబీఐ అధికారులు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు ఆయన వాంగ్మూలాన్ని అప్పట్లో రికార్డ్ చేశారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావడంతో రంగన్నకు 1+1 భద్రత సైతం కల్పించారు అధికారులు.
Also read : చైనా AI డీప్‌సీక్ కారణంగా మస్క్‌కు 90 బిలియన్ డాలర్ల నష్టం