BIG BREAKING: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్!

AP: మాజీ సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

New Update
AVANTHI SRINIVAS

Avanti Srinivas: మాజీ సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది. వైసీపీలో నేతల రాజీనామాల పర్వానికి ఫుల్ స్టాప్ పడలేదు. తాజాగా మరో కీలక నేత వైసీపీ కి వీడేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు.

Also Read: Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా?

ఓడిపోయిన నాటి నుంచి అటు అధిష్టానానికి, అలాగే తన క్యాడర్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు అవంతి శ్రీనివాస్. అయితే రాజీనామా అనంతరం ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. వైసీపీ రాజీనామా చేసే అంశంతో పాటు కీలక విషయాలను చెప్పేందుకు ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెబుతారో వేచి చూడాలి. మరోవైపు ఆయన టీడీపీ లో చేరుతారనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీలోని ముఖ్య నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం.

Also Read: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం..!

ప్రజారాజ్యం నుంచి మొదలు...

అవంతి శ్రీనివాస్‌ రాజకీయ జీవితం 2009లో ప్రజారాజ్యం పార్టీతో ప్రారంభమైంది. చిరంజీవి ఆయనకు భీమిలి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.  ప్రజారాజ్యం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాగా 2014 వరకు అవంతి శ్రీనివాస్ కాంగ్రెస్ లో కొనసాగారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2019లో వైసీపీ లో చేరారు. భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై విజయం సాధించారు. ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో రెండున్నరేండ్ల మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. మళ్ళీ ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు.

Also Read: Ap Weather: వాతావరణశాఖ హెచ్చరికలు..ఏపీలోని ఈ జిల్లాల్లో వానలు!

Also Read: ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment