అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రవీణ్ ఫోన్‌పే, పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి. మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తన బైక్ పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన కోదాడ, ఏలూరులో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసినట్లుగా వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయి. ఇప్పుడు మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరే ముందు ఎల్బీనగర్ సవేరా వైన్స్‌లో లిక్కర్ షాపులో మధ్యాహ్నం 12: 24 నిమిషాలకు రూ. 950 ఫోన్ పే చేసి రెండు టీన్స్ బాటిల్ కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి స్ర్కీన్ షాట్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ముఖానికి మాస్క్ పెట్టుకుని మార్ట్ లోకి వెళ్లి లిక్కర్ కొనుగోలు చేశారు.
Pastor Praveen wines : వైన్ షాపులో పాస్టర్ ప్రవీణ్...రూ.950 ఫోన్ పే చేసి
పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రవీణ్ ఫోన్‌పే, పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి. ఎల్బీనగర్ సవేరా వైన్స్‌లో లిక్కర్ షాపులో మధ్యాహ్నం 12: 24 నిమిషాలకు రూ. 950 ఫోన్ పే చేసి రెండు టీన్స్ బాటిల్ కొనుగోలు చేశారు ప్రవీణ్ .