/rtv/media/media_files/2025/03/11/8fszPcyTEC7QIgC1LRyw.jpg)
Posani Krishna Murali
Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!
ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది.
Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!
కోర్టు ఉత్తర్వుల మేరకు..
గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ ఫర్ ప్రొహిబిషన్/ఎక్సైజ్ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది. తన ఆరోగ్య సమస్యల కారణాలని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. శుక్రవారం గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటీషన్ ని పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది.
Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్
అయితే నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు గత నెల 27న అరెస్టు చేశారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజ అపార్ట్ మెంట్ లోని ఉంటున్న పోసానిని.. బుధవారం రాత్రి ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ లపై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణ, పశ్చిమగోదావరి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?