Big Breaking: వాలంటీర్లకు బిగ్ షాక్.. కీలక ప్రకటన! సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు వాలంటీర్ వ్యవస్థపై షాకింగ్ కామెంట్ చేశారు. వాలంటీర్ వ్యవస్థను 2023లోనే జగన్ ఆపేశారని.. లేని వాలంటీరలకు మేము జీతాలు ఎలా ఇస్తాం అని అన్నారు. By Seetha Ram 18 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశం ముగిసింది. ఈ సమావేశం సుమారు రెండు దఫాలుగా సాగింది. ఈ సమవేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు వాలంటీర్ వ్యవస్థపై షాకింగ్ కామెంట్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఉచిత ఇసుక సంపూర్ణంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుతో సమావేశం మంచి వాతావరణంలో జరిగిందని అన్నారు. ఇది కూడా చదవండి: సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..! ఈ సమావేశంలో చంద్రబాబు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అందులో ఉచిత ఇసుక గురించి అని అన్నారు. నేటి నుంచి ఉచిత ఇసుక సంపూర్ణంగా అమలుచేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఇసుకపై సెస్సు, వ్యాట్ వంటి పన్నులు ఇక లేవు అని తెలిపారు. ఇక నుంచి ఎవరైనా, ఎక్కడైనా ఇసుకను తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి ఇసుక ఓవర్ లోడింగ్ పేరుతో కేసులు నమోదు ఉండవని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: వివో నుంచి కిక్కిచ్చే కొత్త ఫోన్.. ఫీచర్లు మామూలుగా లేవు ! కానీ ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే పీడీ యాక్ట్ అమలుచేస్తాం అని తెలిపారు. అలాగే మద్యం వ్యాపారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దన్నారు. జగన్ ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడారు అని మండిపడ్డారు. అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థపై కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే! లేని వాలంటీరలకు జీతాలు ఎలా ఇస్తాం వాలంటీర్ వ్యవస్థను 2023లోనే జగన్ ఆపేశారు అని అన్నారు. మరి అప్పటి నుంచి లేని వాలంటీరలకు మేము జీతాలు ఎలా ఇస్తాం అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జగన్ అప్పులు తప్ప ఏమీ మిగల్చలేదని.. ఇక దోపిడీ ఎక్కడుంటుందని అన్నారు. కాగా 2024 ఎన్నికల సమయంలో కూటమి అధికారంలోకి వస్తే.. వాలంటీర్ వ్యవస్థను ఆపమని కంటిన్యూ చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్ అంతేకాకుండా వాలంటీర్‌లకు అప్పుడున్న గౌరవ వేతనం రూ.5 వేలు అని.. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ గౌరవ వేతనాన్ని రూ.10 వేలు చేస్తామని తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా.. మరికొందరు విధుల్లో కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో అంతా సతమతమవుతున్నారు. #ap-cm-chandrababu #achchennaidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి