Tirumala: తిరుమల తిరుపతి దేశస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. త్వరలో పదవ తరగతి పరీక్షలు జరగనుండటం, వారంతం కావడంతో భక్తులు దైవదర్శనానికి పోటెత్తారు. మరోవైపు వేసవి సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందనే కారణమే కాకుండా ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. శుక్రవారం నాడు 67,127 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే, శనివారం నాడు సుమారు 69,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,910 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తొమ్మిది కంపార్ట్‌మెంటల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
కాగా తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తుల కోసం - టీటీడీ అధికారులు త్వరలో ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వివిధ రకాల ఆర్జిత సేవలు సహా అన్ని రకాల టికెట్లు/టోకెన్ల జారీ, తిరుపతి, తిరుమలల్లో ఉండే వసతి భవన సముదాయాల్లో గదుల బుకింగ్‌లో ఈకేవైసీ, ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థ అమలులోకి రానుంది. టికెట్ల బుకింగ్‌లో దళారుల జోక్యాన్ని నివారించడానికి టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈకేవైసీ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అవసరమైన గెజిట్ నోటిఫికేషన్‌ను రెవెన్యూ (దేవాదాయం) శాఖ కార్యదర్శి వినయ్ చంద్ జారీ చేశారు. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ విధానాన్ని అమలు చేయాలంటూ టీటీడీ కొత్త పాలక మండలి తన తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందే- ఆధార్ అథెంటికేషన్‌కు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ కార్యనిర్వహణాధికారి.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.
Also Read: Karnataka: నటి రన్యారావు కేసులో కీలక మలుపు..సీబీఐ కేసు
ఇప్పుడు తాజాగా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ ఈకేవైసీ విధానానికి అనుమతులను ఇచ్చింది. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ అమలు విధానం కేంద్రం పరిధిలో ఉన్నందున ఈ అనుమతులను తీసుకోవడం తప్పనిసరి అయిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ అమలు వల్ల టికెట్ల బుకింగ్‌లో మరింత పారదర్శకత ఏర్పడుతుందని, టికెట్/టోకెన్ తీసుకున్న వాళ్లకు బదులుగా వేరొకరు దర్శనాలకు రావడం, వాళ్ల పేర్ల మీద గదులను బుక్ చేయడం వంటి లోపాలను సరిచేయవచ్చని అంటున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు స్వయంగా టోకెన్లు/టికెట్లను తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోన్నారు. దీనివల్ల దళారుల బెడదతను నివారించడంతో పాటు పారదర్శకత సాధ్యమైతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: Peanuts Peel: పల్లీల పొట్టుతో కూడా పుట్టెడు లాభాలు.. ఏంటంటే?
Also Read: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?