ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో టికెట్ ధరలపై బంపరాఫర్ ప్రకటించింది.శీతాకాలం కావడంతో ఏసీ బస్సులకు బాగా ఆదరణ తగ్గింది. దీంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి 10 వరకు.. ఏపీఎస్‌ఆర్టీసీ కొన్ని ఏసీ బస్సుల్లో టికెట్ ధరలపై 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎంవై దానం ప్రకటించారు. Also Read: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్ అంతేకాదు మిగిలిన బస్సుల్లో.. రాను, పోను టిక్కెట్లు ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే అన్ని బస్సుల్లో ఛార్జీల్లో 10 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్టీసీ ప్రకటించిన డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో నడిచే బస్సుల్లో అన్ని డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఆదివారం (అప్), శుక్రవారం (డౌన్) తప్ప మిగిలిన రోజుల్లో విజయవాడ-హైదరాబాద్ మధ్య 10 శాతం రాయితీ అందిచనున్నారు. Also Read: Crime: నడి రోడ్డుపై కత్తులతో నరికి..ఏపీలో హిజ్రాల నాయకురాలి దారుణ హత్య ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీ రూ.770 ఉండగా రాయితీ ఛార్జీ రూ. 700.. మిగిలిన ప్రాంతాలకు 10 శాతం రాయితీ, రూ. 750, (సాధారణ ఛార్జీ రూ. 830).విజయవాడ-బెంగళూరు మధ్య నడిచే వెన్నెల స్లీపర్, అమరావతి బస్సుల్లో ఆదివారం (అప్), శుక్రవారం (డౌన్) తప్ప మిగిలిన రోజుల్లో మాజిస్టిక్ బస్ స్టేషన్ వరకు వెన్నెల స్లీపర్ బస్సుల్లో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. Also Read: Psycho Killer: 11 రోజులు..5 హత్యలు..ఒంటరి మహిళలే లక్ష్యం! ఈ బస్సుల్లో ఛార్జీలు.. రూ.1770 (సాధారణ ఛార్జీ రూ.2170). అమరావతి మల్టీయాక్సిల్ ఛార్జీ రూ. 1530 (సాధారణ ఛార్జీ రూ.1870)గా నిర్ణయించారు. విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీతో ఛార్జీ రూ.970 (సాధారణ ఛార్జీ రూ.1070) గా అధికారులు ప్రకటించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సుల్లో.. గత నెలలో 53 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) ఉండగా.. బెంగళూరు తదితర ప్రాంతాలకు 57 శాతం ఓఆర్ ఉంది. Also Read: Pawan Kalyan: రాజ్యసభకు నాగబాబు.. పవన్ సంచలన నిర్ణయం! ఆక్యుపెన్సీ రేషియో పెంచుకునేందుకు ఆర్టీసీ అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. అందుకే ఏసీ బస్సుల్లో టికెట్లపై రాయితీని ప్రకటించారు. ప్రయాణికులు ఈ డిస్కౌంట్ అవకాాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.