Fengal Cyclone: తీరం దాటేసిన 'ఫెంగల్'.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. పెంగల్‌ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమలలో కురిసిన వర్షానికి శ్రీవారి ఆలయ పరిసరాలు పూర్తి జలమయమయ్యాయి.

New Update
fengal

Fengal : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాను పుదుచ్చేరిలోని మహాబలిపురం- కరైకల్ మధ్య తీరం దాటినట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది.ప్రస్తుతం పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతున్న ఈ తుపాను క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Also Read:  BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..

రెండు రోజులూ భారీ వర్షాలు..

తుపాను తీరం దాటుతోన్న సమయంలో గరిష్ఠంగా గంటకు 90 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తుపాను ప్రభావంతో శుక్రవారం నుంచే తమిళనాడు, రాయలసీమ, దక్షిణకోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆది, సోమవారం రెండు రోజులూ భారీ వర్షాలుంటాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు సమాచారం.

Also Read: Ukraine: ఇంక చేయలేము..చేతులెత్తేస్తున్న ఉక్రెయిన్ సైనికులు

సోమవారం వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ తెలిపింది. మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవుకృష్ణపట్నం పోర్టులో ఆరో నంబరు, విశాఖ, గంగవరం, కాకినాడ,  పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.ఫెంగల్ తుఫాను ప్రభావంతో విశాఖ నుంచి తిరుపతి, చెన్నైకి రాకపోకలుసాగించే విమాన సర్వీసులు శనివారం తాత్కాలికంగా రద్దయ్యాయి.

Also Read: Israel: ఇరాక్ నుంచి ఇజ్రాయెల్‌ పైకి డ్రోన్లు...

విజయవాడ మీదుగా చెన్నై, తిరుపతి, షిర్డీ, చెన్నై నుంచి విజయవాడకు చేరుకోవాల్సిన మొత్తం 8 సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ‘ఇండిగో’ ప్రకటించింది. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం ఆప్రాన్‌ వద్ద వర్షపు నీరు భారీగా చేరింది.

Also Read: TG: ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి: సీఎం రేవంత్ సవాల్

తిరుమలలో శనివారం ఎడతెరిపిలేని వర్షం కురవడంతో శ్రీవారి పాదాలు, పాపవినాశనం వెళ్లే మార్గాలను మూసివేశారు. తిరుపతి జిల్లాలోని కేఎం అగ్రహారంలో అత్యధికంగా 13.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక, తమిళనాడులోని తీరప్రాంత జిల్లాల్లో ఫెంగల్ బీభత్సం సృష్టించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు