Vijayashanthi: పవన్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్‌పై- కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి - ఘాటుగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ-- అన్నా.. హిందూ ధర్మాన్ని నమ్మారని పొగిడేశారు.- అగ్నిప్రమాదం నుంచి కొడుకు బయటపడినందుకు..-- కృతజ్ఞతగా శ్రీవారికి తల నీలాలు ఇచ్చారు. అలాంటి మహిళను ట్రోల్ చేయడం తప్పు- అని మండిపడ్డారు. పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటా తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 15, 2025
అత్యంత అసమంజసం..
'దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు.
హరహర మహాదేవ్. జై తెలంగాణ' అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!
మార్క్ శంకర్‌పై కూడా ..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల వీరు హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ క్రమంలో కొందరు దుండగులు సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు భార్య అన్నా లెజినోవా.. కుమారుడు మార్క్ శంకర్‌పై కూడా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. అయితే వీరిని గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు. అయితే వీళ్లు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్
telugu-news | today telugu news
BREAKING: రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ డొల్ల.. వైఎస్ షర్మిల సంచలన పోస్ట్!
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విజన్ లేదు, విజ్‌డం లేదని టీపీసీసీ షర్మిల అన్నారు. కేవలం ఇంద్రజాలమే తప్పా మిషన్ లేదు మీనింగ్ లేదు అంతా మహేంద్రజాలమే అని విమర్శించారు. రాష్ట్రం గుల్ల బడ్జెట్ అంతా డొల్ల అంటూ పోస్ట్ పెట్టారు.
APCC Sharmila sensational comments on AP budget
YS Sharmila: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విజన్ లేదు, విజ్‌డం లేదని టీపీసీసీ షర్మిల అన్నారు. కేవలం ఇంద్రజాలమే తప్పా మిషన్ లేదు మీనింగ్ లేదు కేవలం మహేంద్రజాలమే అని విమర్శించారు. రాష్ట్రం గుల్ల బడ్జెట్ అంతా డొల్ల అంటూ పస్ట్ పెట్టారు.ఈ మేరకు తొలి బడ్జెట్ సంఖ్య ఘనం - కేటాయింపులు శూన్యం అన్నారు. అంతా అంకెల గారడి - అభూత కల్పన. దశ - దిశ లేని.. పస లేని బడ్జెట్ ఇది అని విమర్శించారు. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు. ఇతర హామీలకు ఎగనామం పెట్టారు. ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్‌తోనే నిరూపితం అయ్యింది. సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్ అంటూ మండిపడ్డారు.
రైతులకు తప్పని నిరీక్షణ..
అన్నదాత సుఖీభవ పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం అరకొరనే. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఎదురుచూస్తుంటే.. రూ.11 వేల కోట్లు నిధులు కావాల్సి ఉంటే.. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతులను నిరీక్షణకు గురి చేయడం అన్యాయం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ముష్టి రూ.300 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇవ్వడం ద్రోహమే. తల్లికి వందనం పథకానికి నిధుల్లో కోత పెట్టారు. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులకు కావాల్సింది రూ.12,600 కోట్లు అయితే.. రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే దాదాపు రూ.3వేల కోట్ల మేర విద్యార్థుల సంఖ్య తగ్గించదలుచుకున్నారా? దీపం 2 పథకానికి ఏడాదికి అవసరం అయిన నిధులు సంఖ్య రూ.4500 కోట్లు. బడ్జెట్‌లో ఉచిత సిలిండర్ల పథకానికి కేటాయింపులు రూ.2601 కోట్లు. కోటిన్నర లబ్ధిదారులు ఉండగా సగం మేర కోత పెట్టదలుచుకున్నారా? అని ప్రశ్నించారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!
జాబ్ క్యాలెండర్ ప్రస్తావనే లేదు..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో నెలకు రూ.350 కోట్లు కేటాయించే పథకానికి నిధులు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి మనసు రాలేదు. నెలకు రూ.1500 ఇచ్చే మహాశక్తి పథకాన్ని మాయం చేశారు. కోటిన్నర మంది మహిళలను అన్యాయం చేశారు. రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి ఒక్క రూపాయి కేటాయించకుండా డ్వాక్రా మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి పథకం ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ ప్రస్తావనే లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను వంచించారు. రాష్ట్ర రాజధానికి ఒక్క రూపాయి కేటాయించకుండా అప్పులతోనే అమరావతి కట్టాలని చూడటం మీ అవివేకానికి నిదర్శనం. రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ఎన్నికల హామీలను గాలికి వదిలేసి మసి పూసి మారేడు కాయ చేశారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!
Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!
పవన్ భార్య అన్నా లెజినోవాపై జరుగుతున్న ట్రోలింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ. Short News | Latest News In Telugu | తిరుపతి | విజయవాడ | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై పుష్పరాజ్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్టు!
కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
AP: మూడు సిటీలు కలిపి మెగా సిటీ..చంద్రబాబు మాస్టర్ ప్లాన్
అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగా సిటీగా రానుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ స్వయంగా తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more. క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Vijayawada: కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?
నైతిక విలువలు నేర్పించాల్సిన గురువు మైమరిచి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Telangana: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: భట్టి విక్రమార్క
Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!
USA-China: ట్రంప్ కు చైనా షాక్..బోయింగ్ విమానాలు బంద్
డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై పుష్పరాజ్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్టు!
AP: మూడు సిటీలు కలిపి మెగా సిటీ..చంద్రబాబు మాస్టర్ ప్లాన్