చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణను వేట కొడవలితో అత్యంత కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపుతోంది. వైసీపీ కార్యకర్త వెంకటరమణ ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రామకృష్ణ కొడుకుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు వెంకటరమణ, గణపతి, మహేష్, త్రిలోక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇటీవలే రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తన ఫిర్యాను పట్టించుకోలేదని రామకృష్ణ ఇటీవలే వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kakinada: పిల్లలను చంపిన తండ్రి కేసు.. వెలుగులోకి వచ్చిన మరికొన్ని విషయాలు
కర్నూలులోనూ..
ఇదిలా ఉంటే.. ఈ రోజు కర్నూలులోనూ ఓ టీడీపీ నేత హత్య జరిగింది. కర్నూలులోని శరీననగర్‌లో మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి అయిన కోశపోగు సంజన్న(55)ను మర్డర్ చేశారు. అదే కాలనీలోని గుడికి వెళ్లి భజన పూర్తి చేసుకొని వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.
ఇది కూడా చదవండి: అక్క అని కూడా చూడలేదు.. సిద్ధార్థ్ అసలు స్వరూపం ఇదే.. బైరెడ్డి శబరి షాకింగ్ సంచలన ఆరోపణలు!
నిందితుడు రామాంజనేయులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరుడిగా చెబుతున్నారు. వీరి కుటుంబాల మధ్య పాతకక్ష్యలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సంజన్న గతంలో వైసీపీలో ఉండి.. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. విషయం తఎలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణం ఆధిపత్య పోరేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.