సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా పోసానిపై మరో కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు. నిన్న సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్న సమయంలో ఈ నోటీసులు అందించారు. పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే కపలు కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్
ఫిబ్రవరిలో అరెస్ట్..
చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ అభియోగాలతో ఫిబ్రవరి 26న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లో పోలీసులు హైదరాబాద్ లోని పోసాని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 16 కేసులు ఆయనపై నమోదయ్యాయి. సీఐడీ కూడా ఆయనను అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో మార్చి 22న పోసాని గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ నో రిలీజ్
మళ్ళీ మొదలు.. కాస్త గ్యాప్ ఇచ్చి షురూ..
— Nagarjuna (@pusapatinag) April 8, 2025
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసు...
చంద్రబాబు ,పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ...
కేసు నమోదు చేసిన సూళ్లూరుపేట పోలీసులు..
ఈ నెల 15న విచారణకు రావాలని ఆదేశం..
నెల రోజులకు పైగా జైల్లో..
దాదాపు నెల రోజులకు పైగా ఆయన ఈ కేసుల్లో జైల్లో ఉన్నారు. కేసు గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడవద్దని.. రూ.2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు పోసానికి స్పష్టం చేసింది. నాలుగు వారాల పాటు ప్రతీ మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు మంగళగిరి లోని ఏపీ సీఐడీ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలని స్పష్టం చేసింది.
(posani krishna murali arrest | telugu-news | latest-telugu-news | telugu breaking news)