/rtv/media/media_files/2025/03/04/HlPS1Yr9B7rS9RWlsdv3.jpg)
MLC Elections
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. 2 రౌండ్ల ముందుగానే ప్రధమ ప్రాధాన్యతా ఓటుతో ఆయన గెలుపు ఖరారైంది. కాసేపట్లో ఎన్నికల అధికారి అయిన ఏలూరు జిల్లా కలెక్టరు నుంచి ఆయన ధ్రువీకరణ పత్రం అందుకోనున్నారు.
పేరాబత్తుల రాజశేఖరం సాధించిన ఓట్లు వివరాలు
1 రౌండ్ లో 16520
2 రౌండ్ లో 16212
3 రౌండ్ లో 16191
4 రౌండ్ లో 15482
5 రౌండ్ లో 15632
6 రౌండ్ లో 16254
7 రౌండ్ లో 16040
7 రౌండ్ లు పూర్తయ్యే సరికి 1,12,331 ఓట్లతో పేరాబత్తుల రాజశేఖరం ముందంజలో ఉన్నారు. 41,268 ఓట్లతో దిడ్ల వీర రాఘవులు రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం 71,063గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 1,96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తైంది. ఇందులో చెల్లిన ఒట్లు 1,78,422 కాగా.. చెల్లని ఓట్లు 17,578గా అధికారులు నిర్ధారించారు. ఇంకా దాదాపు 22,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. గెలుపుకు కావాల్సిన 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించడంతో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం ఖరారైంది.