AP jobs 2026: ఏపీలో కొలువుల పండుగ: ఏ నెలకు ఏ నోటిఫికేషన్? పూర్తి షెడ్యూల్ ఇదే!

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. 2026 మార్చి 18న ఉగాది పర్వదినం సందర్భంగా 10,060 ఖాళీలతో కూడిన అధికారిక జాబ్ క్యాలెండర్‌ను APPSC విడుదల చేసింది.

New Update
Ap jobs

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. 2026 మార్చి 18న ఉగాది పర్వదినం సందర్భంగా 10,060 ఖాళీలతో కూడిన అధికారిక జాబ్ క్యాలెండర్‌ను APPSC విడుదల చేసింది. సుమారు 25 విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవడానికి ప్రభుత్వం తాత్కాలిక తేదీలను ప్రకటించింది:


మే 15, 2026: ఉన్నత విద్యాశాఖలో 1500 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది.

ఆగస్టు 15, 2026: గ్రూప్-1, హోమ్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్లు విడుదలవుతాయి.

సెప్టెంబర్ 15, 2026: గ్రూప్-2, ఇంజనీరింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్లు వస్తాయి.

అక్టోబర్ 15, 2026: పాఠశాల విద్యాశాఖలో అత్యధికంగా 3004 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతుంది.

ఎంపిక విధానం: ఉద్యోగాన్ని బట్టి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ఉంటాయి. పోలీస్ ఉద్యోగాలకు అదనంగా ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: పరీక్షలు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ (OMR) పద్ధతిలో ఉండవచ్చు. దీనిపై స్పష్టత నోటిఫికేషన్ సమయంలో వస్తుంది.

హాల్ టికెట్లు: ప్రతి పరీక్షకు వారం లేదా 10 రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in లోని "Notifications" విభాగంలోకి వెళ్లి పూర్తి జాబ్ క్యాలెండర్ PDF ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు