Andhra Pradesh: చిత్తూరు రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం.. ఎంతంటే ? చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని మంత్రి మండ్లిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. By Vishnu Nagula 15 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మరో 33 మంది గాయాపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రవాణా శాఖ మంత్రి మండ్లిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే గాయపడిన వారికి రూ.లక్ష ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి కూడా బీమా ద్వారా మొత్తం రూ.80 లక్షలు సాయం అందుతుందని చెప్పారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్‌కు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శలు చేశారు. విజయవాడ వరద బాధితులను కేవలం 20 నిమిషాలు పరామర్శించి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని విధాలుగా ఆదుకున్నారని పేర్కొన్నారు. #andhra-pradesh-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి