/rtv/media/media_files/2025/08/26/ap-dsc-2025-08-26-11-34-16.jpg)
DSC notification with 3 thousand posts
DSC : ఆంధ్రప్రదేశ్‌లో 2026 ఉగాది రోజున 3,004ల పోస్టులతో కొత్త డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించిన తర్వాత, ఈ ఏడాది కూడా టీచర్ పోస్టుల భర్తీకి (SGT, SA, TGT, PGT) ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచే అవకాశం ఉంది. ఇందులో 1744 SGT పోస్టులు, మిగతావి భాషా పండితుల పోస్టులు ఉంటాయని అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ పోస్టులకు గాను TET/CTET ఉత్తీర్ణత తప్పనిసరి. 18 - 44 ఏళ్లు (గత నిబంధనల ప్రకారం) వయో పరిమితి విధించే అవకాశం.80% డీఎస్సీ (TRT) మార్కులు + 20% టెట్ (TET) వెయిటేజీ ఆధారంగా నియామించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాగా వీటితో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రధానంగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందు​కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అదే సమయంలో ఇతర శాఖల్లో ఖాళీల భర్తీ దిశగా జాబ్ క్యాలెండర్ ప్రకటనకు కసరత్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు.
ఉగాది రోజున మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ 'ఎక్స్' ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిన 10 వేల పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలతో అధికారులు జాబ్ క్యాలెండర్‌ను సిద్ధం చేశారు. ఇందులో డీఎస్సీ, జూనియర్ లెక్చరర్ పోస్టులు 3 వేలు ఉండగా. డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ ఉద్యోగాలు 2,600కు పైగా ఉంటాయని తెలుస్తోంది. బోధనా సిబ్బంది పోస్టులు 1,500 వరకు ఉంటాయి. ఇవే కాక గ్రూప్-1లో వందకు పైగా పోస్టులు, గ్రూప్-2 470కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి రెండూ కలిపి సుమారు 600 వరకు ఉంటాయి. అలాగే వెయ్యి కానిస్టేబుల్ ఉద్యోగాలు, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులనూ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తుంది. డీఎస్సీ నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఇస్తుంది. మిగిలిన వివిధ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయనుంది. నిర్దేశిత గడువులో వీటిని భర్తీ చేసేలా అధికారులు క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది.
Follow Us