/rtv/media/media_files/2025/01/09/vIKMK3Px67pxioVBFliO.jpg)
YCP Leader Roja
మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పేరుతో నిర్వహించిన పోటీల్లో భారీ ఎత్తున అవినితీ జరిగిందని ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ఆడుదాం ఆంధ్రా పేరుతో పోటీలు నిర్వహించింది. అయితే ప్రభుత్వం కేటాయించినవే కాకుండా జిల్లాలోని నిధులు కూడా వినియోగించినట్లు పలువురు సభ్యులు ఆరోపణలు చేశారు. ఇందులో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఏసీబీ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా రోజా ఉన్నారు. ఈ క్రమంలో త్వరలో రోజా అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీలోనే కీలక నేతలు వరుసగా అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
Also read : డంకీరూట్ లో మరో ఇండియన్ మృతి..అక్కడే భార్య బిడ్డలు!
Also read : CSK: జడేజా ఎంట్రీ వీడియో మామూలుగా లేదుగా...పుష్పరాజ్ రేంజ్ లో ..!
'' ఆడుదాం ఆంధ్ర'' పేరిట ఆంధ్ర రాష్ట్రంతోనే ఆడుకున్నారు గత వైసీపీ నేతలు. బొమ్మలు,రంగులు,స్టికర్లు మీద ఫోకస్ పెట్టారు తప్ప,క్రీడలు మీద వీళ్లు ఫోకస్ పెట్టలేదు. - ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ pic.twitter.com/7xmAOFpXhW
— Political Trolls (@Political_Tro) March 11, 2025
ఆడుదాం ఆంధ్రాపై చర్చ
అటు ఆడుదాం ఆంధ్రాపై నిన్న ఏపీ అసెంబ్లీలో చర్చ కూడా నడిచింది. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ... 47 రోజుల్లో రూ.120 కోట్లు మంచినీళ్లలా ఖర్చు పెట్టారని కీలక కామెంట్స్ చేశారు. దీనిపై మాట్లాడాలంటే తనకే సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు గోల్ మాల్ అయ్యాయని కూటమి ఎమ్మెల్యేలు చర్చ సందర్భంగా ఆరోపించారు.
Also read : అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి
Also read: చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానంటే రిజెక్ట్ చేశా : సోము వీర్రాజు కీలక కామెంట్స్