పోలీసులు మెత్తబడ్డారు.. ఇది జగన్ సర్కార్ కాదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు

సరస్వతి పవర్ కోసం జగన్ బాంబులేసి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నాడని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ రైతులకు ఇంకా న్యాయం జరగలేదన్నారు. పోలీసులు మెత్తబడ్డారని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉందో చేసి చూపిస్తామన్నారు.

author-image
By Nikhil
New Update
Deputy CM Pawan Kalyan Jansena Party

ఏపీ మాజీ సీఎం జగన్ కు సంబంధించిన సరస్వతి పవర్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలో సరస్వతి పవర్‌ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాజమాన్యం 1384 ఎకరాల భూముని కొన్నట్లు చెప్పారు. అందులో 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉందన్నారు. బాంబులేసి భయపెట్టి రైతుల నుంచి భూములు తీసుకున్నారని ఆరోపించారు. ఇలాగే వదిలేస్తే పేట్రేగి పోతారన్నారు. రైతులకు అండగా ఉండటానికి తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఇక్కడికి ఫ్యాక్టరీ రాలేదు కానీ.. అన్నాచెల్లెళ్లు కొట్టుకున్నారన్నారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చి తీసేసుకున్నారన్నారు. మరి ఫ్యాక్టరీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Lady Aghori: అఘోరీపై ఏపీ డీజీపీకి లేఖ.. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేరు!

యాభై ఏళ్లకు ఒకేసారి లీజు..

జగన్ సీఎంగా ఉన్నప్పుడు యాభై ఏళ్ళకు లీజు తీసుకున్నారన్నారు. ఉపాధి అవకాశాలు ఇస్తే సంతోషమన్నారు. సహజ వనరులు ఒకరి సొంతం కాదన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతిలివ్వరని క్యాప్టివ్ పవర్ గా అనుమతి తీసుకున్నారన్నారు. పొల్యూషన్ బోర్డు అనుమతి తీసుకోలేదన్నారు. 700 ఎకరాల భూమి మాచవరం, దాచేపల్లి మండలాల్లో స్వంత ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారన్నారు. రైతులకు, వారి పిల్లలకు ఉద్యోలిస్తామని భూములు తీసుకున్నారన్నారు. ఇది రాష్ట్ర సమస్య అని అన్నారు. గతంలో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వేసి భయపెట్టారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Minister Narayana : చంద్రబాబు Vs పవన్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

సరస్వతి కంపెనీకి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదన్నారు. గత ప్రభుత్వం ఇప్పుడున్న యువతను భయపెట్టిందన్నారు. పోలీసులు భయపడ్డారు.. లేదంటే మెత్తబడ్డారన్నారు. రౌడీయిజాన్ని అరికట్టాలన్నారు. కొందరు ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు భావిస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉందో చేసి చూపిస్తామన్నారు. 700 ఎకరాలకు సరిపోయేంత నీళ్ళు తీసేసుకున్నారన్నారు. ఈ విషయంపై తాను కేబినెట్లో కూడా చర్చిస్తానన్నారు. ప్రజలపై బాంబుల దాడి చేస్తే చూస్తూ ఊరుకోవద్దని ఎస్పీకి చెబుతున్నానన్నారు. 

ఇది కూడా చదవండి :పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆ హామీకి గ్రీన్ సిగ్నల్!

ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అమరావతి నుంచి హైదరాబాద్‌కు రూ.25 వేల కోట్లతో చేపట్టే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

New Update
Prime Minister Modi visit AP on January 8th

Modi government good news to AP

AP News: NDA కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీపై మోదీ సర్కార్‌ వరాల జల్లు కురిపిస్తోంది. ఓ వైపు పోలవరం.. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణాలను ముందుకు తీసుకెళ్తుంది. ఇంకొవైపు రాష్ట్ర విభజన సమయం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం దిశగా అడుగులెస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్రం ప్రభుత్వం.  

5 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్..

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్ర విభజన వేళ నుంచి పరిష్కారం కాని సమస్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అమరావతి నుంచి హైదరాబాద్‌కు  గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం డీపీఆర్‌ సిద్ధం చేయాలని హోంశాఖను ఆదేశించింది. మొత్తం 6 లైన్లలో దాదాపు 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఏం మనిషివిరా.. దారుణం.. అక్కనే చంపిన తమ్ముడు

అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే వస్తే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర ప్రయాణం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ హైవేను అమరావతి నుంచి హైదరాబాద్‌కు ఏ రూట్‌లో ప్లాన్ చేశారన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం అమరావతి నుంచి హైదరాబాద్‌కు రెండు రూట్‌లు ఉన్నాయి. విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు ఒక రూట్.. పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్‌కు మరో రూట్ ఉంది.  ఇందులో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ఏ రూట్‌ నుంచి వస్తుందనేది స్పష్టం కాలేదు.

ఇది కూడా చదవండి: పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే జరిగేది ఇదే

మరోవైపు ఇప్పటికే అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం భూ సేకరణ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందుకోసం కేంద్రం నిధులనూ మంజూరు చేసింది. ఇదే సమయంలో - ఏపీలో మరో రిఫైనరీని ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఆదేశించింది కేంద్రం. అలాగే అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్‌లు రూపొందించాలని సూచించింది.

 modi | chandrababu | today telugu news

Advertisment
Advertisment
Advertisment