Pawan Kalyan: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్వీట్ రియాక్షన్.. తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పదించారు. ఎంతో మంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ కెరీర్ ప్రారంభించిన విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. By Seetha Ram 28 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి తమిళ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలతో పిచ్చ ఫ్యాన్స్‌కు క్రియేట్ చేసుకున్నారు. తమిళ్ సహా తెలుగులోనూ ఆయనకు డైహర్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా తమిళ్‌లో విజయ్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అంచలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాడు. దానికి ప్రధాన కారణం.. అతడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమే. ఇది కూడా చూడండి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్! టీవీకే మహానాడు ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘తమిళగ వెట్రి కలగం’ అనే పార్టీని స్థాపించారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో వస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఆదివారం తమిళనాడులోని విల్లపురంలో టీవీకే (తమిళగ వెట్రి కలగం) మహానాడు నిర్వహించారు. దీనికి హాజరైన విజయ్ తనదైన శైలిలో స్పీచ్‌తో అదరగొట్టేశారు. టీవీకే పార్టీ తొలి మహానాడు సభకు తండోప తండాలుగా ప్రజలు వచ్చారు. ఇది కూడా చూడండి: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు.. ఈ మహానాడు సభకు అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. ఇందులో భాగంగా విజయ్ తమ పార్టీ సిద్ధాంతాలు, తాను రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలను తెలిపారు. కె.కామరాజ్, పెరియార్ ఈవీ రామస్వామి, అంబేడ్కర్ ఆశయాలతో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా.. ప్రజలందరి నమ్మకంతో రాజకీయాల్లోకి సినిమా కెరీర్ అగ్రస్థానంలో ఉన్నప్పుడే వదిలేసి ప్రజలందరి నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. ఈ మహానాడుకు విశేష రెస్పాన్స్ రావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్‌గా మారినట్లు.. తమిళ్‌లో విజయ్ తన మార్క్ చూపిస్తారా? అనే చర్చ నడుస్తోంది. My Heartfelt Congratulations!! to Thiru @actorvijay avl, for embarking on a political journey in Tamilnadu, the land of Saints & Siddhars.@tvkvijayhq — Pawan Kalyan (@PawanKalyan) October 28, 2024 ఇది కూడా చూడండి: ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య విజయ్ రాజకీయ ఎంట్రీపై పవన్ రియాక్షన్ ఈ క్రమంలోనే విజయ్ రాజకీయ ఎంట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విజయ్‌కు అభినందనలు తెలుపుతూ.. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా విజయ్ అండ్ పవన్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన విజయం తర్వాత విజయ్ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్‌ను అభినందించారు. ఇక ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ ఆవిర్భవ నేపథ్యంలో పవన్ కూడా విజయ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. #tamilnadu #Dy CM Pawan Kalyan #tvk manadu vijay full speech మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి