చంద్రబాబును కలిసిన ఐఏఎస్‌లు.. గ్రేటర్ విశాఖ కమిషనర్‌గా ఎవరంటే!

ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్ ఇవాళ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లలో ఆమ్రపాలికి వైజాగ్ మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

New Update
AP CM Chandrababu

ఐఏఎస్ అధికారులు తమ సొంత కేడర్ రాష్ట్రాలకు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. దీంతో ఐఏఎస్‌ అధికారులు రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌లు సీఎస్ నీరబ్ కుమార్‌‌కు గురువారం రిపోర్ట్ చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నలుగురు ఐఏఎస్‌లు తమ జాయినింగ్ రిపోర్ట్‌ను సీఎస్‌‌కు సమర్పించారు. అనంతరం ఇవాళ ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఇది కూడా చదవండి:  ఫుట్‌పాత్‌ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

అందరిలోనూ ఆసక్తి

ఇక ఏపీలో అడుగుపెట్టిన ఈ నలుగురు ఐఏఎస్‌ అధికారులకు ఎలాంటి శాఖలు కేటాయించనున్నారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా ఆమ్రపాలికి ఏ శాఖ ఇవ్వనున్నారు? అనే ఉత్కంఠ మొదలైంది. డైనమిక్ ఆఫీసర్‌గా ఆమ్రపాలికి ఎంతో పేరు ఉంది. గతంలో ఆమ్రపాలి ప్రధాని కార్యాలయం పీఓంలో విధులు నిర్వర్తించారు. అక్కడ దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను ఆమె పర్యవేక్షించారు. సుదీర్ఘకాలం పాటు ఆమె విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత తెలంగాణ సర్కార్ ఆమెను కేంద్రం నుంచి రప్పించి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించింది.

ఇది కూడా చదవండి: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

పవన్‌కళ్యాణ్ టీంలోకి ఆమ్రపాలి

అలాంటి ఆమ్రపాలిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇప్పుడు తన టీంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఈ రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే కేరళ కేడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను తన ఓఎస్డీగా నియమించుకున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

ఇక ఇప్పుడు డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రాపాలి సేవలను పవన్ కళ్యాణ్ తన శాఖలోనే వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా ఆమ్రపాలి సొంతూరు ప్రకాశం జిల్లా. దీనిబట్టి ఆమెకు రాష్ట్రం మొత్తం అవగాన ఉంటుంది.

ఇది కూడా చదవండి: 'రివాల్వర్ రీటా' వచ్చేసింది.. కీర్తి కొత్త మూవీ టీజర్ అదిరింది

వైజాగ్ మున్సిపాలిటీ కమిషనర్‌గా ఆమ్రాపాలి!

అందులోనూ వైజాగ్ అంటే ఆమెకు కొట్టినపిండి లాంటిదే. ఆమె వైజాగ్‌లోనే చదువుకున్నారు కూడా. దీనిబట్టి ఆమెను వైజాగ్ మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించే అవకాశాలున్నాయని సమాచారం. చూడాలి మరి ఈ ఆమెకు ఏ శాఖలో బాధ్యతలు అప్పగిస్తారో.

Advertisment
Advertisment
తాజా కథనాలు