CM Chandrbabu: తెలంగాణ లీడర్లు రెచ్చగొడుతున్నారు..  చంద్రబాబు సంచలన కామెంట్స్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తెలంగాణ నేతలు అనవసర విషయాలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

New Update
babu

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తెలంగాణ నేతలు అనవసర విషయాలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు కరెక్ట్ కాదని ఆయన హితవు పలికారు.

పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేయడంలో తప్పేముంది?: "నేను మొన్ననే తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చాను. అక్కడ కర్నాటకతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల నేతలు వచ్చి ప్రచారం చేశారు. కర్నాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ కూడా ఉంది. గతంలో బీఆర్‌ఎస్ నేషనల్ పార్టీ అని చెప్పి ఏపీలో కూడా ఆఫీస్ పెట్టారు, విస్తరిస్తాం అన్నారు. మరి అప్పుడు లేని అభ్యంతరం, ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలో ఎందుకు వస్తోందో నాకైతే అర్థం కావడం లేదు" అని చంద్రబాబు ప్రశ్నించారు.

మన తెలుగువాళ్లు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాలేదని చంద్రబాబు గుర్తుచేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో కూడా తెలుగువారు పెద్ద పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్నారని, అక్కడ ఉండే రూల్స్ ప్రకారం పని చేస్తూ లీడర్లుగా ఎదుగుతున్నారని చెప్పారు. ప్రజలకు ఎవరు మంచి సేవలు చేస్తే వాళ్లే నాయకులు అవుతారని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలందరికీ బాగా తెలుసు

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అయిపోయింది. రెండు రాష్ట్రాలు విడిపోయి ఎవరి దారిలో వాళ్లున్నారు. ఇప్పుడు తెలంగాణలోని కొందరు నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడి లేనిపోని సమస్యలు, విద్వేషాలు సృష్టించలేరు. ఎవరి ప్రాంతం ఏంటో, ఎవరు ఎలాంటి వాళ్లో ప్రజలందరికీ బాగా తెలుసు. లీడర్లు ఎవరైనా ప్రజా చైతన్యంలో, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలి కానీ, ఇలాంటి అనవసరమైన విషయాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు" అని చంద్రబాబు గట్టిగా చెప్పారు.

పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు ఈ స్థాయిలో మద్దతుగా నిలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని కోరుకునే సమయంలో, కొందరు నేతలు పాత విషయాలను లాగి రాజకీయం చేయడాన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisment
తాజా కథనాలు