Chandrababu: విజయసాయిరెడ్డి రాజీనామా.. జగన్ పై చంద్రబాబు సెటైర్లు-VIDEO

విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని జగన్ పై సెటైర్లు వేశారు. లేదంటే ఎవరి మార్గం వాళ్లు చూసుకుంటారన్నారు. విజయసాయి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమన్నారు. 

New Update

తాను ఇక రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు ఈ  రోజు స్పందించారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని జగన్ పై సెటైర్లు వేశారు. లేదంటే ఎవరి మార్గం వాళ్లు చూసుకుంటారన్నారు. విజయసాయి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమన్నారు. 

గంటా సీరియస్ కామెంట్స్..

విజయసాయి అంశంపై మాజీమంత్రి, భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీరియస్ కామెంట్స్ చేశారు. పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి ఎంపీ విజయసాయిరెడ్డి అని సెటైర్లు వేశారు. 5 ఏళ్ళు పాటు విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ గా మారారని ఆరోపించారు. విలువైన 2 లక్షల గజాలకు పైగా భూమిని విజయసాయిరెడ్డి అండ్ కో దోచేశారన్నారు. తర్లువాడ కొండను కొట్టేయాలని చూశారని ఆరోపించారు. విసారెడ్డి రాజీనామా స్టేట్మెంట్ చూస్తే జాలేసిందని ఎద్దేవా చేశారు. రాజీనామా చేసి తప్పుకుంటే ఆయన చేసిన పాపాలు పోతాయా? అని ప్రశ్నించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు