AP CM Chandrababu: సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఏపీ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

New Update

వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అధికారులను అడిగారు.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆడిట్ చేయాలని ఆదేశించారు. అనంతరం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు.

అపరిశుభ్రతపై అసంతృప్తి..

అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు వెంట సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా తదితరులు ఉన్నారు. 

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

(telugu-news | latest-telugu-news | telugu breaking news ap cm chandrababu naidu)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. అయితే మీకో చేదువార్త!

మే, జూన్ నెలల్లో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు.

New Update
ttd

ttd

వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో టీటీడీ వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రకటించారు.

Also  Read:  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే, జూన్‌ రెండు నెలలపాటు వేసవి సెలవుల వల్ల కుటుంబాలతో శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వారు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా.. దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతించరాదని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

Also Read: BRS Silver Jubilee : ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా...అధికారం నుంచి ప్రతిపక్షంగా.. బీఆర్‌ఎస్‌ గెలుపు ఓటముల 25 ఏండ్ల ప్రస్థానం

‘‘మే, జూన్ నెలల్లో వేసవి సెలవులుతో పాటు అన్ని పరీక్ష ఫలితాలు కూడా వెల్లడి కావడంతో తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫారసు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు" ఆయన ప్రకటించారు. అంటే, ఈ రెండు నెలల పాటు ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉండవు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

Also Read: 🔴Live News Updates: ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్‌ యాత్ర.. కేంద్ర విదేశాంగ మంత్రి కీలక ప్రకటన

Also Read: Vizianagaram : చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది గుద్ది చంపిన కొడుకు!

ttd | tirumala | summer | holidays | rush | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు