మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. కేవలం రూ.2 లక్షలకే.. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వనుంది. కేవలం రూ.2 లక్షలు చెల్లిస్తే శిక్షణ పొందిన వారికి డ్రోన్‌ను అందజేస్తారు. ఈ శిక్షణ ఇవ్వడం వల్ల మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు సాగులో సాంకేతికతను పెంచవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. By Kusuma 20 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. డ్వాక్రా సంఘాలకు డ్రోన్ పైలట్‌లో శిక్షణ ఇవ్వనుంది. ఇందులో శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ శిక్షణలో భాగంగా గ్రామంలో కొందరు మహిళలను ఎంపిక చేసి అందులో డ్రోన్ పైలట్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం రెండు లక్షలకే శిక్షణ తీసుకున్న వారికి డ్రోన్‌ను ఇవ్వనున్నారు. దీనివల్ల మహిళలకు ఆర్థికంగా చేయూతగా ఉండటంతో పాటు సాగులో సాంకేతికత ఉంటుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్! వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ శిక్షణ వల్ల సాగు విషయంలో సాంకేతికత పెరుగుతుంది. అలాగే వ్యవసాయ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కూలీలు, ఖర్చులు తగ్గించుకుందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు పొలంలో ఎరువులు పిచికారీ చేయాలంటే కూలీలు దొరకడం కష్టం. దీనివల్ల కొన్ని రోజుల సమయం పట్టడంతో పాటు డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. అదే డ్రోన్ ఉంటే ఈజీగా ఒక్క రోజులో పని పూర్తవుతుంది. ఈ డ్రోన్లను గ్రామంలో అన్ని వ్యవసాయ పనులకు వినియోగించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇది కూడా చూడండి: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..! ఈ డ్రోన్ల బాధ్యతను కూడా డ్వాక్రా మహిళలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించుకోంది. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనుంది.గ్రామాల్లో ఎంపిక చేసిన మహిళలకు ఒక 15 రోజుల పాటు డ్రోన్లపై శిక్షణ ఇవ్వనున్నారు. కుటుంబంలో ఒకరికి రిమోట్ పైలట్‌గా శిక్షణ ఇస్తే మిగతా వారికి ఫిటింగ్, మెకానికల్, రిపైర్ వంటి వాటిపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా శిక్షణ ఇచ్చిన తర్వాత వీరికి సర్టిఫికేట్లు కూడా ఇస్తారు. గ్రామాల్లో ఉండే మహిళలు నేర్చుకోవడం వల్ల వ్యవసాయ రంగంలో బాగా సాయపడుతుంది. ఈ డ్రోన్లలో శిక్షణ పొందిన మహిళకు రూ.10 లక్షల విలువ చేసే వాటిని అందిస్తారు. ఇంత ఖరీదు డ్రోన్లలను 80 శాతం రాయితీతో లబ్ధిదారులకు కేవలం రూ.2 లక్షలకే ఇస్తారు. మిగతా రూ.8 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు! #andhra-padesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి