TDP నేతలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో నామినేటెడ్ పదవుల జాతర ఉంటుందన్నారు. టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో సీఎం ఈ రోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై మాట్లాడారు. కష్టపడ్డ కార్యకర్తలను నేతలు గుర్తు పెట్టుకోవాని సూచించారు. పార్టీ విజయానికి పాటుపడ్డ వారికే నామినేటెడ్ పదవులు ఉంటాయన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవులు ఆశిస్తున్న వారు క్యూబ్స్‌లో (CUBS) సభ్యులుగా ఉండాల్న కండిషన్ విధించారు చంద్రబాబు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్‌లో సభ్యులైతేనే పదవులు వస్తాయని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: YS Jagan: జగన్ కు బిగ్ షాక్.. ఎంపీ అయోధ్య సంచలన వ్యాఖ్యలు!
త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డుల్లో నియామకాలు ఉంటాయని తెలిపారు. 32 మందితో త్వరలో తొలి జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు చంద్రబాబు. రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేసిన తర్వాతే మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయన్నారు. మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చి చేరిన వారికంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలనే ప్రోత్సహించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు పథకాలన్నీ ఇస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!
ప్రజలకు అందుబాటులో ఉండండి..
ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని సూచించారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టామన్నారు. ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలన్నారు. ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు.