/rtv/media/media_files/2025/02/06/Hbvovrn8XKYifroNjyP1.jpg)
ap cabinet
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 21 అంశాలు ఏజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీ రూపొందిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read : ఇలా చేశావ్ ఏంటీ భయ్యా : ఆసీస్కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
Also Read : ఏపీలో దారుణం.. పామాయిల్ తోటలో పంచాయితీ.. కొడవలితో భార్య గొంతు కోసి..!
పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు
ఈ మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వర్గాల పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే ఇళ్ల టెండర్ లను రద్దు చేసి కొత్త టెండర్ లను పిలిచే ప్రతిపాదనపై కేబినెట్ చర్చిస్తోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రిమండలి సమావేశం అయింది.#APCabinet #ChandraBabuNaidu #AndhraPradesh pic.twitter.com/aal5Tpq8zy
— Telugu Desam Party (@JaiTDP) February 6, 2025
నీరు చెట్టు కింద రూ.330 కోట్ల మేర పెండింగ్ బిల్లులను చెల్లించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. మద్యం, బీర్లు, ఎఫ్‌ఎల్- స్పిరిట్‌పై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ రివిజన్‌పై కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ నడుస్తోంది.. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణపై ప్రతిపాదనపై చర్చిస్తోంది.
Also Read : Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..
Also Read : గిరిజన యువతులు నల్లగా, అంద వికారంగా.. ఒడిశా సీఎం చీప్ కామెంట్స్!