AP: ఆ మూడు పదాలు తొలగింపు.. ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చేసిన సూచనలను అనుసరించి డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ చట్టం - 1986కు సవరణ చేయగా.. ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.హెల్త్‌ వర్సిటీ చట్టం నుంచి ‘కుష్ఠు, చెవిటి, మూగ’ పదాలు తొలగించారు.

New Update
BREAKING: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP:

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చేసిన సూచనలను అనుసరించి డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీచట్టం 1986కు సవరణను చేసింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ ఆమోదించగా.. హెల్త్‌ వర్సిటీ చట్టం నుంచి ‘కుష్ఠు, చెవిటి, మూగ’ పదాలు తొలగించింది. వర్సిటీ బోర్డులో కుష్ఠు రోగులు, చెవిటి, మూగ సమస్యలు కలిగిన వారు సభ్యులుగా చేరేందుకు అర్హులు కాదని విశ్వవిద్యాలయం చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

Also Read:  IRCTC: పుణ్య క్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ట్రైన్‌!

అయితే వీరిపై వివక్ష చూపరాదంటూ ఎన్‌హెచ్‌ఆర్సీ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన సూచనలు చేసింది.ఆ సూచనల మేరకు చట్ట సవరణలను ప్రతిపాదిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అసెంబ్లీలో తెలిపారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ చట్టానికి సవరణ కోరుతూ బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. ఆమోదం లభించింది. 

Also Read: Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!

దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఆయుర్వేదిక్‌ అండ్‌ హోమియోపతి మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ చట్టంకు సవరణలను ప్రతిపాదిస్తూ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. వాటికి సభ ఆమోదం తెలిపింది. ఏపీ కో – ఆపరేటివ్‌ సొసైటీస్‌ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.అసెంబ్లీలో మొత్తం 7 బిల్లులకు ఆమోదం తెలిపారు. పైన తెలిపిన బిల్లులతో పాటుా.. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు-2024, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ సవరణ బిల్లు-2024, ఇద్దరికి మించి పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హత నిబంధనను ఎత్తివేస్తూ చట్ట సవరణ చేసింది. 

Also Read: TG Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్!

ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ నిరోధక బిల్లు-2024కు శాసనసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ కో-ఆప‌రేటివ్ సోసైట్ స‌వ‌ర‌ణ బిల్లు-2024నూ శాసనసభ ఆమోదం తెలియజేసింది.రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.. ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 

Also Read: Pawan: పవన్ కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో ...కోర్టు కీలక ఆదేశాలు!

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని.. పేద విద్యార్థులు కూడా వైద్య విద్య అభ్యసించాలనే కల నెరవేరుస్తామన్నారు. మంగళగిరిలో 30 పడకల వైద్యశాలను వంద పడకలుగా మార్చేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేశారన్నారు. దీనికి అవసరమైన సౌకర్యాలు కల్పించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.మరోవైపు ఏపీ ప్రభుత్వం వెటర్నరీ కౌన్సిల్‌ సభ్యుడిగా మాజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌‌గా పీవీ లక్ష్మయ్యను నియమించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు