/rtv/media/media_files/2025/03/01/SN2fZFXmNI0h7eGNhM9d.webp)
Parawada Pharmacity
Paravada Pharmacy : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఏక్టోరియా యూనిట్-6లో ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువులు పీల్చి ఓ కాంట్రాక్టు ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. విషవాయువులు లీకవడంతో వాటిని అదుపు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: GV Reddy: చంద్రబాబు గ్రేట్.. బడ్జెట్ సూపర్.. రాజీనామా తర్వాత జీవీ రెడ్డి సంచలన ట్వీట్!
పరవాడ ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ విష వాయువు లీక్ కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తోరెంట్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ ఘటన చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం కార్మికులను యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. గతంలో విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్‌లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడిగా గుర్తించారు.
Also Read : మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా?
జనవరి 21వ తేదీన కూడా ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. స్ట్రీమింగ్ ఇందులోనే!
కాగా, గత ఏడాది డిసెంబర్‌లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్‌ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్‌హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్‌ఆర్‌గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియానే.. ఆస్ట్రేలియా ఓడిపోతుంది : మైఖేల్ క్లార్క్
Also Read : అంతా తూచ్.. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా : సీఐ సంచలన ప్రకటన