Annadata sukhibhava : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

రైతులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది

New Update
annadata

రైతులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి ఒక్కో రైతుకు రూ. 6,000 చొప్పున జమ చేశారు. ఈ విడత కోసం మొత్తం రూ. 2,676 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటానే రూ. 1,874 కోట్లుగా ఉంది.

నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే

ఇప్పటికే రెండు విడతల్లో కలిపి రైతులకు రూ. 14,000 అందించిన ప్రభుత్వం, తాజాగా  రూ. 6,000తో కలిపి ఏడాదికి ఇస్తామన్న రూ. 20,000 సాయం హామీని పూర్తి చేసింది. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతున్నందున, అభ్యర్థులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒకవేళ ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే వెంటనే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.

మీ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం రెండు సులభమైన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. రైతులు నేరుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'Know Your Status' ఆప్షన్ ద్వారా తమ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సాంకేతికతను వాడుకుంటూ 'మనమిత్ర' వాట్సాప్ నెంబర్ (9552300009) కు 'హాయ్' అని మెసేజ్ పంపి, అక్కడ వచ్చే ఆప్షన్లలో అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎంచుకుని కూడా తమ వివరాలను సరిచూసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు