AP : ఏపీలో మద్యానికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర ఓ కీలక ప్రకటన చేశారు. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.99 మద్యానికి మంచి ఆదరణ లభిస్తోందని.. ఇప్పటి వరకు 5 లక్షకేసులకు పైగా విక్రయాలు జరిగాయి అన్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నట్లు వివరించారు. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయని వివరించారు.
Also Read: Soudi: రాజద్రోహం, అత్యాచారం నేరాల కింద సౌదీలో ఈ ఏడాది 214 మంది ఉరి!
ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.కూటమి ప్రభుత్వం మద్యం షాపుల్ని పెంచలేదని మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల తెలిపారు. గత ఐదేళ్లలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా మద్యం షాపుల్ని కేటాయించామని..నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.
Also Read: విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా.. విడాకులు పై నోరు విప్పిన రెహమాన్!
గత ప్రభుత్వంలో రూ.1,800 కోట్ల అవినీతి జరిగిందని.. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు సైతం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. రూ.99కే నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చామన్నారు. కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చి మద్యం ధర తగ్గించామని.. గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ జరుపుతామని మంత్రి అన్నారు. అక్రమార్కుల అందరిపైనా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.రూ.99కే చీప్ లిక్కర్‌ను అన్ని చోట్లా అందుబాటులో మంత్రి కొల్లు రవీంద్ర తీసుకొస్తామన్నారు. పొరుగు రాష్ట్రం కంటే ఏపీలో ధర తక్కువే ఉండేలా.. టెండర్ కమిటీ ద్వారా మద్యం రేట్లను నిర్ణయిస్తామని వివరించారు.
Also Read: Gold Robbery: తెలంగాణలో భారీ చోరీ.. 15 కిలోల బంగారం మాయం
గతంలో ఉన్న ఉన్న 3396 షాపులకే టెండర్లు పిలిచి లాటరీలో కేటాయించామని.. వీటిలో 10 శాతం కల్లుగీత కార్మికులకు కేటాయించినట్లు వివరించారు. పారదర్శకంగా మద్యం షాపులు కేటాయించామని.. లాటరీల ద్వారా మద్యం షాపులు కేటాయించడంతో వైసీపీ వారికి కూడా మద్యం షాపులు దక్కాయన్నారు. అలాగే బెల్టు షాపులపై చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Also Read: Viral : ఓర్ని ఇదేం విచిత్రం.. చితి నుంచి లేచి నీళ్లు అడిగిన వృద్ధురాలు