ఏపీలోని మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. రేపటి నుంచే..!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఈ నూతన మద్యం పాలసీకి ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. అక్టోబర్ 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది. కొత్త పాలసీలో భాగంగా మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10గంటల వరకూ తెరిచి ఉండనున్నాయి.

New Update
Liquor Shop Timings

Liquor Shop Timings: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మద్యం షాపులకు లాటరీ డ్రా నిర్వహించారు. మొత్తం 3,396 షాపులకు 89,882 అప్లికేషన్లు వచ్చాయి. వాటికి కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు లాటరీ తీసి మద్యం షాపుల విజేతల్ని ప్రకటించారు. అదే సమయంలో మద్యం షాపులు గెలిపొందిన వారిలో కొందరికి బడా బాబుల నుంచి బెదిరింపులు వచ్చాయని వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇది కూడా చదవండి: చంద్రబాబు స్కిల్ కేసులో ఈడీ దూకుడు.. భారీగా ఆస్తులు అటాచ్!

అంతేకాకుండా మరికొన్ని చోట్ల మద్యం షాపులు గెలిపొందిన వ్యాపారులు కిడ్నాప్ అయ్యారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఎంతో పారదర్శకంగా నిర్వహించిన మద్యం షాపుల కేటాయింపుపై ఎవరైనా జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

రూ.1,797 కోట్ల ఆదాయం

ఇది కూడా చదవండి: మద్యం షాపులకు లాటరీ.. ఎన్నో చిత్ర విచిత్రాలు బాబోయ్, ఆశ్చర్యపోతారు!

వ్యాపారదారు వారు అప్లై చేసుకున్న ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు చొప్పున చెల్లించారు. అలా ఎన్ని అప్లికేషన్లు పెడితే అన్ని రూ.2 లక్షలు చెల్లించారు. లాటరీలో మద్యం షాపులు గెలుపొందకపోయినా.. ఆ రూ.2 లక్షల వెనక్కి తిరిగి రావు. ఇక మద్యం షాపులు గెలుపొందిన వారు వచ్చే రెండేళ్ల వరకు వ్యాపారం చేసుకోవచ్చు. ఈ లిక్కర్ షాపుల దరఖాస్తు ప్రక్రియతో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది. 

రేపే ఓపెనింగ్

ఇది కూడా చదవండి: దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అర్థరాత్రి ఆటోలో అత్యాచారం

ఈ లాటరీలో మద్యం షాపులు ఎవరైతే గెలుచుకున్నారో వారికి ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. అక్టోబర్ 16 (బుధవారం) నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. అయితే తేదీతో పాటు టైమింగ్స్‌ను కూడా ప్రభుత్వం వెల్లడించింది. 

టైమింగ్స్..

ఇది కూడా చదవండి: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!

లాటరీ పద్దతి ప్రకారం మద్యం షాపులను గెలుపొందిన వ్యాపారులు కొత్త పాలసీలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం మరో విషయం కూడా తెలిపింది. తక్కువ ధరకే మద్యం విక్రయాలు జరుగుతాయని పేర్కొంది.

అలాగే డిజిటల్ పేమెంట్స్ సైతం చేసుకోవచ్చని తెలిపింది. దీని కారణంగా కూటమి ప్రభుత్వం నగదు చెల్లింపు సమస్యకు చెక్ పెట్టనుంది. అయితే మద్యం వ్యాపారుదారులకు కొన్ని హెచ్చరికలు చేసింది. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెబుతోంది. లేకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు