AP: కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు ఎప్పటి నుంచి చేసుకోవాలంటే!

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల్ని స్వీకరించాాలని నిర్ణయించింది.

New Update
Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Ap: ఏపీలో కొత్త రేషన్‌ కార్డుల పై కూటమి ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. రాష్ట్రంలో రేషన్‌ కార్డు లేని పేదలకు కొత్తగా రేషన్‌ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. డిసెంబరు 2 నుంచి 28వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్‌ కార్డు కీలకం కావడంతో.. లక్షలాదిమంది కొత్త కార్డుల కోసం చూస్తున్నవారు ఉన్నారు.

గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్నా కార్డులు రానివారు కూడా కొత్త కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి వరకూ చేసుకున్న దరఖాస్తులను కూడా పరిగణనలోనికి తీసుకుని..అన్నింటినీ పరిశీలించి అర్హులకు రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.

Also Read: Chaitu-Sobitha: ఆ శూన్యాన్ని ఆమె పూడుస్తుందంటున్న చైతూ!

కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాదు.. ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. కొత్త రేషన్ కార్డుల డిజైన్లను ఎంపిక చేసే పనిలో పడింది. దీనిని త్వరగా పూర్తి చేసి కొత్త కార్డులన్నీ ముద్రించి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న కార్డుల్లో వైఎస్ జగన్ ఫోటో ఉంది.. వాటిని పూర్తిగా తీసి మార్చేయబోతున్నారు.

Also Read:  Putin: ట్రంప్‌ ప్రాణాలకు రక్షణ లేదు..పుతిన్‌ కీలక వ్యాఖ్యలు!

క్యూఆర్‌ కోడ్‌తో పాటు కుటుంబ సభ్యుల చిత్రాలతో వీటిని ముద్రిస్తారు. కొత్త టెక్నాలజీని జోడించి.. లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు.. కొత్తగా పెళ్లయిన వారికి కార్డులు జారీ చేయనున్నారు. కొత్తగా వివాహం చేసుకున్న వారికి కార్డులు ఇవ్వాలంటే.. అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్‌ కార్డుల నుంచి పేర్లు తొలిగించాలి. ఈ కారణంతో కొత్తగా పెళ్లైన వారిలో కొందరికి కార్డులు రాలేదు.

Also Read: మహారాష్ట్ర సీఎం ఎంపికలో మరో కొత్త ట్విస్ట్.. తెరపైకి కొత్త పేర్లు!

ఈ సమస్యను పరిష్కరించేంందుకు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా కొత్త జంటకు రేషన్‌ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు, ఒంటరిగా ఉన్న వారికీ రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి.

అర్హులకు కార్డులు ఇవ్వకుండా ఆపినట్లు తెలుస్తుంది. అందుకే ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి.. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. అందుకే గ్రామసభలు కూడా నిర్వహించనున్నారు. 

కొత్తగా రేషన్‌కార్డులు కావాలనుకునే వారు డిసెంబరు 2 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. డిసెంబర్ 28 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని..జనవరి 1 నుంచి మార్చి వరకు పరిశీలించి, అర్హులైన వారికి కార్డులు అందిస్తామని తెలిపారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల్ని ఇవ్వనుంది.

Also Read:  ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు..ఎందుకంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు