AP: టెన్త్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షా విధానంలో మార్పులు! వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్ సిలబస్ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. By Bhavana 22 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ap Tenth Exams: ఏపీలో పదో తరగతికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులకు రెడీ అవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్ సిలబస్ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు అవసరమైన కసరత్తులు మొదలు పెట్టారు. Also Read: మేము చనిపోతాం.. అనుమతివ్వండి అన్ని స్కూళ్లకు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌నే... ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌లోని అన్ని స్కూళ్లకు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌నే అమలు చేస్తున్నారు. ఎన్‌సీఈఆర్టీ సిలబస్ చదువుతూనే విద్యార్థులు రాష్ట్ర బోర్డు పరీక్షలు రాస్తున్నారు. అయితే సీబీఎస్‌ఈలో ఇంటర్నల్ మార్కుల విధానం ఉంది. గతంలో సీసీఈ విధానంలో ఇంటర్నల్ మార్కులు ఉండగా.. 2019లో వీటిని రద్దు చేశారు. Also Read: ఆంధ్ర ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లో తిరగనివ్వం..! ఇంటర్నల్ మార్కుల విషయంలో ప్రభుత్వ స్కూళ్లు నిబంధనలు పాటిస్తున్నా.. ప్రైవేటు స్కూళ్లు ఇష్టవచ్చినట్లుగా మార్కులు వేసుకుంటున్నాయని ఫిర్యాదులు అందడంతో ఆ విధానాన్ని రద్దు చేశారు. Also Read: మళ్ళీ పని మొదలు పెట్టిన హైడ్రా బుల్డోజర్లు.ఈ సారి ఎక్కడో తెలుసా? ఇప్పుడు 2025-26 విద్యాసంవత్సరం నుంచి పదిలో రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ 20 మార్కులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే స్కూళ్లలో ఇష్టం వచ్చినట్లుగా మార్కులు వేసుకోకుండా పకడ్బందీ విధానాన్ని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.సీబీఎస్‌ఈలో ఇంటర్నల్ మార్కులు 20కి 20 వేసుకోకుండా ప్రత్యేకంగా ఓ విధానాన్ని అమలు చేస్తున్నారు. Also Read: ద్వారకా తిరుమలలోనే మకాం వేసిన చిరుత! ఇప్పుడు అలాంటి విధానాన్నే రాష్ట్రంలో కూడా తీసుకురావాలని భావిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షల్లో సూక్ష్మ, లఘు ప్రశ్నలు 12 ఉంటాయి. వీటికి ఒక్కో దానికి అరమార్కు, తేలికైన 8 ప్రశ్నలకు ఒక్కో మార్కు ఉండగా.. వీటిని ఒక్కో మార్కు ప్రశ్నలుగా మార్పు చేయాలనే అంశం పై అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తానికి పదో తరగతికి సంబంధించి ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేస్తోంది. #ssc #ap-10th-exams మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి