కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం అమరావతిలో నిన్న ప్రారంభమైన డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. సీఎం చంద్రబాబు మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో దీన్ని ప్రారంభించారు. జాతీయ స్థాయిలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. By Kusuma 23 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి అమరావతిలో జరిగిన డ్రోన్ షో అందరిని ఆకట్టుకుంది. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సులో మొత్తం తొమ్మిది ప్యానల్ డిస్కషన్స్, 50 స్టాళ్లలో డ్రోనతో ప్రదర్శనలు, అలాగే రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రం ఆవిష్కరణ లాంటి తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకి అందించారు. ఇది కూడా చూడండి: Big Breaking: ఏపీలో టీడీపీ నేత దారుణ హత్య This evening, I joined my people of Amaravati to watch a brilliant drone show that made five Guinness World Records. I congratulate all the organizers and participants for their talented performances and for making this event a grand success. This is the dusk that marked the dawn… pic.twitter.com/ktef3aUgAY — N Chandrababu Naidu (@ncbn) October 22, 2024 కాంతులతో అమరావతి.. కృష్ణా నది తీరంలో ఈ డ్రోన్ షో కాంతులతో కలకలలాడింది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో దీన్ని ప్రారంభించారు. ఈ డ్రోన్ సమ్మిట్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. Not 1, not 2… we just broke FIVE world records. Yeah, we did it again.#BotLabDynamics #DroneLightShow #DroneShow #AmaravatiDroneSummit #Vijayawadadroneshow #AmaravatiDroneSummit2024 pic.twitter.com/HaL2CQ91Zx — BotLab Dynamics (@BotLabDynamics) October 22, 2024 ఇది కూడా చూడండి: Dana Cyclone: దూసుకొస్తున్న దానా..బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం! ఆకాశంలో వివిధ రూపాల్లో వస్తున్న డ్రోన్‌ల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విమానం ఎగరడం, జాతీయ పతాకం రెపరెపలాడటం, బుద్ధుడు ధ్యానం చేయడం, భూమి తిరగడం లాంటి వాటిని డ్రోన్ల ద్వారా నిర్వాహకులు అద్భుతంగా ప్రదర్శించారు. డ్రోన్ల ప్రదర్శనకు ముందు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఈ డ్రోన్ సమ్మిట్‌లో మాట్లాడారు. The Drone Show is currently underway in Amaravati.🤩#AmaravatiDroneSummit pic.twitter.com/JysvZ8dVbg — Amaravati Nexus (@AmaravatiNexus) October 22, 2024 ఇది కూడా చూడండి:ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొనసాగుతోన్న వాయుగుండం అమరావతిలో జరుగుతున్న డ్రోన్ సమ్మిట్.. ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 1995లో కొత్తగా వస్తున్న ఐటీని స్వీకరించామని.. దాని ఫలితమే ఈరోజు ఐటీ రంగంలో తెలుగువాళ్లు ముందున్నారని అభిప్రాయపడ్డారు. భారతీయులు ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతున్నారు. కొత్తగా వచ్చే సాంకేతికతను అందిపుచ్చుకొని.. అవకాశాలను సృష్టించికోవడంలో ఏపీ ప్రభుత్వం ముందుంటుందన్నారు. 🚨 Amaravati Drone Show sets a new world record with an impressive display of 5,000 drones, making it India's largest and one of the world's most significant drone performances. #AmaravatiDroneSummit #AndhraPradesh pic.twitter.com/ApsKaBNUhq — The Archers Today. (@theArchersToday) October 22, 2024 ఇది కూడా చూడండి: Telangana: రాష్ట్రవ్యాప్తంగా 162 మంది ఏఈవోల సస్పెన్షన్! #Amaravati The City Of FUTURE 🌍#AmaravatiDroneSummit#NaraChandraBabuNaidu#AndhraPradesh pic.twitter.com/CHL9drHITo — Ꮇᴏʜᴀɴ🦁NBK✌️ (@CBNBK6) October 22, 2024 #drone మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి