YSRCP: వైసీపీ లో చేరిన బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ
బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ సిద్దాంతాలు, పనులు చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు.
బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ సిద్దాంతాలు, పనులు చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు.
అంగన్ వాడిలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 5లోగా విధుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.
టీడీపీ, జనసేన పొత్తు ఫిక్స్ కావడంతో తమ టికెట్ ఎక్కడ పోతుందోనని అనుమానం ఉన్న టీడీపీ నేతలు పవన్, నాగబాబు చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో తమ టికెట్ అడగొద్దని వారు రిక్వెస్ట్ చేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
ఏపీ సీఎం జగన్ మొహన్ రెడ్డి పనితీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస అవసరాలు లేకపోయినా సీఎం మాత్రం వైద్య సేవలపై గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలోని హైవేపై ఘటన చోటుచేసుకుంది.
అంగన్వాడిల డిమాండ్ లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి ఉషశ్రీ. అంగన్వాడీ లు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే, గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదన్నారు.
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై వైసీపీ నేత వై. విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నీరు విడుదల చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.
అభివృద్ధి పేరుతో ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఉపేక్షించబోమని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. తాడిమర్రిలో రహదారుల ఏర్పాటు పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి బాధితులకు సరైన పరిహారం ఇవ్వకుండా నివాస గృహాలు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.