ఆంధ్రప్రదేశ్ AP TDP Leaders Arrest: టీడీపీ లీడర్స్ అరెస్ట్..ఏపీలో హై టెన్షన్..! ఏపీలో హై టెన్షన్ నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం Ananthapuram: అనంతలో హైటెన్షన్..గోరంట్ల హౌస్ అరెస్ట్! అనంతపురం జిల్లా(Ananthapuram)లో హైటెన్షన్ నెలకొంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్(MP Gorantla Madhav)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుత్తి నియోజకవర్గంలో చంద్రబాబు(Chandrababu) పర్యటనను అడ్డుకుంటామని ఎంపీ గోరంట్ల గట్టి వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. By Jyoshna Sappogula 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం Chandrababu: నన్ను అరెస్ట్ చేస్తారు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ నోటీసుల నేపథ్యంలో రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసినా చేస్తారంటూ తెలిపారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By BalaMurali Krishna 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP vs TDP: నట సింహానికి చెక్ పెట్టేదెవరు? వైసీపీ వేసిన స్కెచ్ ఏంటి? సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు చెక్ పెట్టడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద స్కెచ్ వేసిందా..? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? నందమూరి బాలకృష్ణను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ, గతంలో వైసిపి వర్గ విభేదాల వల్లనే వైసిపి ఓటమి పాలు అవుతూ వస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ పెద్దలు. 1983 టిడిపి ఆవిర్భావం నుంచి హిందూపురం టిడిపికి కంచుకోటుగా ఉంది. నందమూరి తారక రామారావు రెండుసార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా నందమూరి హరికృష్ణ సైతం ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. By E. Chinni 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం సత్యసాయి నీటి పథకం ఉద్యోగుల అర్థనగ్న ప్రదర్శన...! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్యసాయి నీటి పథకం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత ఐదు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని చెబుతూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. త ఐదారు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. వెంటనే పాత బకాయిలను చెల్లించి తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెళ్లారు. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!! కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్ బీని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లే ముందే మోదీన్ బీకి ఓ మందు ఇవ్వగా.. అది వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC Prabhakar Reddy: పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ! తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు పై మండిపడ్డారు. కేవలం అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల కోసమే పోలీసులు పని చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో పోలీసులమని చెప్పి..2 కోట్లు ఎత్తుకెళ్లారు! అనంతపురం జిల్లా గార్ల దిన్నె లో సినిమా డ్రామాని తలపించే విధంగా ఓ దొంగతనం జరిగింది. పోలీసులమని చెప్పి కారులో ఉన్న సుమారు 2 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకుపోయారు. By Bhavana 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC Prabhakar Reddy: తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం.. జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు అనంతపురంలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా దీనిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఈ వ్యవహారంపై జేసీకి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఆపాలని తాను ఎక్కడా అనడం లేదన్నారు. By E. Chinni 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn