తెలుగు వారిని ఘోరంగా అవమానించిన తమిళనటి.. సేవ చేయడమే వారి పని అంటూ

సీనియర్ నటి కస్తూరి తెలుగు వారిపై చేసిన వివాదాస్పద వాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడినట్లు డీఎంకే వాళ్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు తనపై చూపుతున్న ప్రేమను తట్టుకోలేకపోతున్నారన్నారు.

New Update
Actress Kasturi

సీనియర్ నటి కస్తూరి తెలుగు వారిపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. అంతఃపురంలో మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమిళులమని చెప్పుకుంటున్నారని అన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రచ్చ మొదలైంది. తన వ్యాఖ్యలపై నటి తాజాగా క్లారిటీ ఇచ్చింది.

నటి క్లారిటీ

Also Read:   ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా డీఎంకే వాళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా తనపై నెగెటివిటి తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు తనపై ఎంతో అభిమానం చూపుతున్నారని తెలిపారు. ఆ ప్రేమను చూడలేక కొందరు దూరం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. తెలుగు తన మెట్టినిల్లు అని.. తెలుగు వారంతా తన కుటుంబం అని అన్నారు. 

Also Read: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

 కస్తూరి వ్యాఖ్యలపై బీజేపీ నేత పొంగులేటి ఫైర్

నటి కస్తూరి వ్యాఖ్యలపై బీజేపీ నేత, తమిళనాడు సహా ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ ఫైర్ అయ్యారు. కస్తూరి చూసుకుని మాట్లాడారా? లేక మరెవరైనా మాట్లాడించారా? లేదా మరేదైనా అజెండా ఉందా? అనేది తేలియడం లేదన్నారు. దీనిపై తీవ్రంగా అభ్యంతరాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఆమె తెలుగువారిపైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తప్పనిసరిగా వాపసు తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

Also read:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

కస్తూరి ఏమన్నారంటే

దాదాపు 300 ఏళ్ల కిందట ఓ రాజు దగ్గర అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటున్నారని అన్నారు. మరి శతాబ్దాలకు పూర్వమే ఇక్కడకొచ్చిన బ్రాహ్మణులను.. తమిళులు కాదని చెప్పడానికి మీరెవరంటూ పరోక్షంగా ద్రవిడ వాదులను ప్రశ్నించారు.

Also Read:  కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

తెలుగు మాట్లాడితే చాలు తమిళనాడు కేబినెట్‌లో మంత్రులు అయిపోతున్నారని.. అలా డీఎంకే ప్రభుత్వంలో దాదాపు 5గురు తెలుగు మంత్రులు ఉన్నారని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పలువురు ఫైర్ అవుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు