/rtv/media/media_files/2025/03/28/7bwE6sRNeQbgzYNnOBBd.jpg)
10th Class Exam
ఏపీలో మార్చి 31న జరగాల్సిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. దీంతో మార్చి 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి అధికారులు సూచించారు. ఇదిలాఉండగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పులు జరగొచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Also Read: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం!
మార్చి 17న పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న ఇంగ్లీష్, 24న గణితం, 26న ఫిజిక్స్, మార్చి 28న బయాలజీ, 29న ఒకేషనల్ పరీక్షలు జరిగాయి. మార్చి 31న జరగాల్సిన సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ సందర్భంగా వాయిదా పడింది.
Also Read: నేపాల్‌లో మరోసారి ఘర్షణలు..హిందూ దేశం, రాచరిక పాలన కావాలని డిమాండ్