AP: మాజీ మంత్రి తనయుడి బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా..! మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ ACB కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ అయిన జోగి రాజీవ్ ప్రస్తుతం విజయవాడలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. By Jyoshna Sappogula 15 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Jogi Ramesh Son Rajiv: మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్‌ను ACB అధికారులు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జోగి రాజీవ్ విజయవాడ కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో, జోగి రాజీవ్ విజయవాడ ACB కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. Also Read: పంద్రాగస్టు పండగ.. పదకొండోసారి ఎర్రకోట పై జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ అటు, జోగి రాజీవ్ ను 7 రోజులు కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు పంపింది. ఈ రెండు పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. #ap-news #jogi-ramesh #agri-gold #jogi-ramesh-son మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి